తెలుగు రాష్ట్రాలు

నిండుకుండలా నాగార్జునసాగర్… 24 గేట్ల ఎత్తివేత..!

  • భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద
  • నాగార్జున సాగర్ ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులు
  • సాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.30

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో, శ్రీశైలం, నాగార్జునసాగర్ కు భారీగా వద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉండగా 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఇక సాగర్ కు ఇన్ ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది.

Related posts

రాష్ట్రపతి విందుకు సమంత… కలలో కూడా ఊహించలేదంటూ ఎమోషనల్ పోస్ట్…

Ram Narayana

హరీశ్ రావును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పై పయ్యావుల కేశవ్ విమర్శలు

Ram Narayana

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ ..

Ram Narayana