ఖమ్మం వార్తలు

శాస్త్రీయ భావాల వైపు ప్రజలను మరల్చాలి…ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.చంద్రశేఖర్ రావు

శాస్త్రీయ భావాల వైపు ప్రజలను మరల్చాలి…

  • జెవివి కృషి అభినందనీయం
  • జెవివి జిల్లా ప్లీనం లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.చంద్రశేఖర్ రావు
  • సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన సైబర్ క్రైమ్ ఏసీపీ సిహెచ్ ఆర్.వి. ఫణీందర్

శాస్త్రీయ భావాల వైపు ప్రజల్ని మరల్చాల్సిన అవసరం ఎంత గానో ఉందని, అందుకు జెవివి చేస్తున్న కృషి అభినందనీయమని ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక జిలా ప్లీనం ప్రారంభ సభ జిల్లా అధ్యక్షుడు వి.మోహన్ అధ్యక్షత న ఖమ్మం లోని మంచికంటి మీటింగ్ హాల్ లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు ప్రారంభోపన్యాసం చేశారు. మూఢ నమ్మకాల వంటి దురాచారాల పట్ల ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి కేసుల దాకా వెళ్తున్నారని, వారికి చైతన్య న్యాయం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టికల్ 31 ఏ ప్రకారం 1995 నుండి న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ఇవి మండలం నుండి సుప్రీంకోర్టు వరకు ఉంటాయన్నారు. పేదలకు, న్యాయ వాదులు కూడా ముందుకు రాని కేసులలో కూడా న్యాయ సహాయ కేంద్రాలు న్యాయ సహాయం చేస్తాయన్నారు. వీటిని అందరూ వినియోగించుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ సిహెచ్.ఆర్.వి ఫణీందర్ మాట్లాడుతూ మనిషి ఆశ, భయం అనే శక్తులు ఎప్పుడూ పిడిస్తుంటాయని , వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటర్నెట్ వాడేటప్పుడు వ్యక్తిగత వివరాలను ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి ఇవ్వ వద్దని సూచించారు. అందరూ మాస్కడ్ ఆధార్ కార్డులను వాడాలన్నారు. దీని వల్ల సైబర్ నేరాలు జరుగబోవన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం కె.రాములమ్మ, వి.సునంద, వి.మోహన్ అధ్యక్ష వర్గంగా జరిగిన ప్లీనంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు చెలిమల రాజేశ్వర్, రాజా దిశానిర్దేశం చేశారు. కార్యదర్శి కె.రామారావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం 7 సబ్ కమిటీల కన్వీనర్లు నివేదికను ప్రవేశపెట్టారు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, సార్వత్రిక విద్యా విధానం, పర్యావరణం, ఆరోగ్యం, లీగల్ అడ్వైజరి అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మాణాలను ప్లీనం ఆమోదించింది. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు అలవాల నాగేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లెం పాటి వీర భద్రరావు, మచ్చా సూర్యనారాయణ, వంజాకు లక్ష్మి నారాయణ, కోశాధికారి ఎల్.వి. రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్. శ్రీనివాస్, ఆర్.వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులే నేరుగా కూరగాయల వ్యాపారం చేసేలా చర్యలు …మంత్రి తుమ్మల

Ram Narayana

జర్నలిస్టులకు కంటివెలుగు ప్రత్యేక శిబిరం అభినందనీయం …జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు…

Drukpadam

మైరా మురిపెంలో.. పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు

Ram Narayana