తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్ లో మూగపోయిన మైకులు …నియోజవర్గంలో బయట వ్యక్తులు నో పర్మిషన్

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడింది …ప్రచారంతో హోరెత్తిన మైకులు మూగపోయాయి …దీంతో నగర వాసులు హమ్మయ్య అనుకున్నారు..త్రిముఖ పోటీ నెలకొన్న ఈ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు , ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ల చైర్మన్లు ప్రచారంలో పాల్గొన్నారు ..బీఆర్ యస్ తరుపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీష్ రావు , తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి హేమ హేమీలు ,మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు…బీజేపీ తరుపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ , ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పాల్గొన్నారు .. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా? పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశాయి..

ఎన్నిక ఈనెల 11న పోలింగ్ జరగనుండగా, 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది ..
ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలోకి దిగగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే త్రిముఖ పోటీ నెలకొంది
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది
ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా, అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు .ఈ ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి .అధికార కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీఎంనే నాలుగు రోజులు రోడ్ షోలు నిర్వహించారు
బీఆర్ఎస్ నుండి కేటీఆర్ అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు నిర్వహించారు
కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించినా కేవలం పార్టీ ముఖ్యులకు మాత్రమే దిశానిర్దేశం చేశారు. హరీశ్ రావు తండ్రి మరణించడంతో ప్రచార బాధ్యత మొత్తం కేటీఆర్ నే చూసుకున్నారు .బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు
అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.

రేపు రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశాం. మూడంచెల భద్రత ఉంటుంది. 45 FST, 45 SST టీమ్స్ నియోజకవర్గం లో పని చేస్తున్నాయి. 2,060 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారని ఆర్వీ కర్ణన్‌ పేర్కొన్నారు.

పారా మిలిటరీ బలగాలు..
”561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్స్, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ల క్యూ మెయింటెన్ చేయడానికి NCC వాలంటీర్లు పని చేయనున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ పారామిలిటరీ బలగాలు బందోబస్తులో ఉంటాయి. డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తాం. ఫోన్‌ పే, గూగుల్ పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంపే అంశంపై ఆర్‌బీఐతో మీటింగ్ పెట్టాం. ఆర్‌బీఐ మానిటరింగ్ ఉంటుంది. ఇప్పటినుంచి 11 సాయంత్రం వరకు వైన్ షాప్‌లు క్లోజ్ ఉంటాయి. ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలి” అని ఆర్వీ కర్ణన్ తెలిపారు

Related posts

నిజామాబాద్ జిల్లాలో ఘోరం… ఇంటి కోసం ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

Ram Narayana

అన్నపూర్ణ భోజన కేంద్రాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ram Narayana

పోల్ కమ్మ వాగుకు నిరసన డిసెంబర్ 9న బంద్ మావోయిస్టు పార్టీ పిలుపు!

Ram Narayana