జాతీయ వార్తలు

కారు బాంబు పేలుడు.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

  • కారు బాంబు పేలుడులో 13 మంది మృతి
  • శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
  • బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.

Related posts

విశ్వవ్యాపితంగా వినాయక చవితి సంబురాలు ..

Ram Narayana

సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు సైరన్ …

Ram Narayana

హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు!

Ram Narayana