Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు సైరన్ …

డిసెంబరు 4 నుంచి సమ్మె సైరన్ మోగిస్తున్న వివిధ బ్యాంకులు

  • సమ్మె కార్యాచరణకు సిద్ధమవుతున్న బ్యాంకులు
  • డిసెంబరు 4 నుంచి 11 వరకు సమ్మె
  • బ్యాంకుల్లో శాశ్వత సిబ్బంది నియామకాలు జరపాలని డిమాండ్
  • ఔట్ సోర్సింగ్ సేవలకు స్వస్తి పలకాలంటున్న బ్యాంకు ఉద్యోగ సంఘాలు

దేశంలోని వివిధ బ్యాంకులు సమ్మె కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకుల్లో తగినంత మంది శాశ్వత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలకు స్వస్తి పలకాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ఉద్యోగుల వల్ల బ్యాంకు ఖాతాదారుల కీలక సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 

డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా… డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. 

డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్… డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర… డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.

Related posts

దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ. 54,545 కోట్లు.. వెల్లడించిన ఏడీఆర్-ఎన్ఈడబ్ల్యూ

Ram Narayana

గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన కేంద్రం.. వారికైతే ఏకంగా రూ. 400 తగ్గింపు!

Ram Narayana

సోనియా గాంధీ రిటైర్మెంట్ వార్తలపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ!

Drukpadam

Leave a Comment