ఆంధ్రప్రదేశ్

ముఠాల మూలాలు తేల్చండి.. విశాఖ గోమాంసం ఘటనపై పవన్ కల్యాణ్ సీరియస్!

  • విశాఖ గోమాంసం నిల్వలపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
  • ముఠాల మూలాలను వెంటనే తేల్చాలని పోలీసులకు ఆదేశం
  • నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక 
  • పోలీస్ కమిషనర్‌తో స్వయంగా మాట్లాడి వివరాలు సేకరణ
  • కోల్డ్ స్టోరేజీలో 1.89 లక్షల కిలోల గో మాంసం స్వాధీనం

విశాఖ నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ దందా వెనుక ఉన్న ముఠాల మూలాలను తక్షణమే వెలికితీయాలని విశాఖ పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఘటన వెలుగులోకి రాగానే ఆయన నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీలో జరిపిన దాడుల్లో 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని, కేసును పోలీసులకు అప్పగించినట్లు కమిషనర్ పవన్ కల్యాణ్‌కు వివరించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఈ మాంసాన్ని ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడికి తరలించాలని చూశారు, అనుమతుల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ పేర్కొన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

అక్రమ గోవధ, గోమాంసం విక్రయాలు, ఎగుమతులను ఏ రూపంలోనూ సహించేది లేదని పవన్ తేల్చిచెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం గోవధ నిషేధంపై ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. గతంలో తన దృష్టికి రాగానే పిఠాపురంలోని జంతు వధశాలను మూసివేయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Related posts

Microsoft’s Surface App Shows Accessory Battery Levels

Drukpadam

కుతుబ్ షాహీపై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్

Ram Narayana

మంత్రి గంగుల ఇంటిపై ఐటీ ,ఈడీ దాడులు హుటాహుటిన ఇండియా కు…

Drukpadam