ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధాని అమరావతిలో కాగ్ కార్యాలయం…

  • అమరావతిలో కాగ్ కార్యాలయ భవనానికి కేంద్రం ఆమోదం
  • రాజధాని అభివృద్ధిలో ఇది కీలక అడుగన్న కేంద్ర మంత్రి  పెమ్మసాని
  • తన విజ్ఞప్తి మేరకు అనుమతులు లభించాయన్న పెమ్మసాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముఖ్యమైన ముందడుగు పడింది. అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2.05 ఎకరాల స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అమరావతిని పూర్తిస్థాయి, శక్తిమంతమైన పాలనా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక బలమైన అడుగు అని కేంద్రమంత్రి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. తన అభ్యర్థన మేరకు ఈ అనుమతులు లభించాయని ఆయన అన్నారు. 

Related posts

తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సుప్రీం కోర్ట్ అనుమతి …

Ram Narayana

ఏపీ లో బియ్యం వద్దనుకునే వారికీ నగదు బదిలీ ….

Drukpadam

పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం: జస్టిస్‌ చంద్రు

Drukpadam