సుప్రీం కోర్ట్ వార్తలు

ఎమ్మెల్యేల అనర్హత కేసు.. స్పీకర్కు మరో నాలుగు వారాలు గడు

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై విచారణ

స్పీకర్​కు నాలుగు వారాలు గడువు

ఎమ్మెల్యేల ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్‌ తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు నివేదిక

సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో స్పీకర్‌ విఫలమయ్యారన్న బీఆర్‌ఎస్‌ లాయర్

మిగతా ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్‌కు 4 వారాల గడువిచ్చిన ధర్మాసనం

  • పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు సుప్రీంకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది
  • ఈ నాలుగు వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తిచేసి నిర్ణయం వెలువరించాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై జస్టీస్ సంజయ్ కరోల్, జస్టిస్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది
  • ఈ విచారణలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్‌ పూర్తిగా విఫలమయ్యారని పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్, కేటీఆర్ తరపు న్యాయవాదులు వివరించారు
  • విచారించిన ధర్మాసనం స్పీకర్ కు 4 వారాల సమయమిస్తూ వాయిదా వేసింది

Related posts

సాక్షులను బెదిరిస్తే ఇకపై నేరుగా ఎఫ్ఐఆర్… సుప్రీంకోర్టు కీలక తీర్పు

Ram Narayana

ఇకపై అన్ని కేసుల‌ విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు స‌రికొత్త ప్రయోగం!

Ram Narayana

కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Ram Narayana