తెలుగు రాష్ట్రాలు

ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలో నాణ్యతాలోపాలు..!

అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర  జాతీయరహదారుల సంస్థ చేపట్టి నిర్మిస్తున్న ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే తెలుగు రాష్ట్రాలకు ఒక వరం లాంటిదే అయినా నాణ్యత లోపలకు కేరాఫ్ గా ఉందా అంటే అవుననే అంటున్నారు దానిపై ప్రయాణించిన వాహనదారులు ….ప్రత్యేకించి కల్వర్టులు బ్రిడ్జిలు నిర్మించిన దగ్గర వాహనంలో ప్రయాణించేటప్పుడు ఊగుతున్నట్లు , జంప్ చేస్తున్నట్లు అనిపిస్తుందని అభిప్రాయాలు ఉన్నాయి. రోడ్డును కొంచెం విశాలంగా నిర్మించే బదులు కచ్చితంగా రెండు లైన్లే నిర్మించడం వల్ల  ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోడ్డుపై తక్కువ వాహనాలే ప్రయాణిస్తున్న ప్రమాదాలు తప్పడం లేదు. సంక్రాంతి సందర్భంగా వెళుతున్న వాహనాలు రెండు మూడు ప్రమాదాలు జరిగాయి.

సుమారు 130కిలోమీటర్ల దూరంతో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను రూ.3500కోట్లతో చేపట్టగా.. ఐదేళ్లుగా సాగుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 3ప్యాకేజీలు, ఏపీలోని పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ప్యాకేజీల కింద ఈ పనులు చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి వైరా మండలం సోమవరం వరకు రహదారి పనులు పూర్తయ్యాయి . జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి వరకు సుమారు 25కి.మీ మేర రహదారి నిర్మించాల్సి ఉంది. ఖమ్మం సమీపంలోని ధంసలాపురం వద్ద రైల్వే క్రాసింగ్‌ బ్రిడ్జి పనులు, మున్నేరుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నా కొంత ఆలసమ్యమయ్యే పరిస్థితి ఉంది. ఉగాది నాటికీ పూర్తీ చేసి వాహనాలను ఆరోడ్డు పై నడిపించనున్నారు .. త్వరగా పూర్తిచేసి వాహనాల రాకపోకలు సాగించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత అధికారులను ,కాంట్రాక్టర్ ను ఆదేశించారు … దీంతో ఖమ్మం సమీపంలో మున్నేరు పై జంగారెడ్డిగూడెం వద్ద ఫారెస్ట్ భూముల క్లియరెన్స్ వల్ల కొంత ఆలస్యం అయింది . సంక్రాంతి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే పై పాక్షికంగా రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇచ్చారు .దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి . అయితే పేరుకే గ్రీన్ ఫీల్డ్ రహదారిగా ఉంది . టు వీలర్స్ ట్రాక్టర్లు , ఆటోలు నిషేధం ఉన్నప్పటికీ రోడ్ పై టు వీలర్స్ కనిపించాయి..కొన్ని చోట్ల రోడ్ కు ఒకవైపునే వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి ..ఇంకా టోల్ ప్లాజాలు ప్రారంభం కాలేదు ..ఖమ్మం -సూర్యాపేట రోడ్ తో పోలిస్తే కొంచం ఇరుకుగా ఉన్నట్లు కనిపిస్తుంది …ఇక రోడ్ నాణ్యత సరిగాలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…రోడ్ పై వెహికిల్ వెళ్తుంటే అక్కడక్కడా జంప్ చేస్తున్నట్లు అనిపిస్తుంది …ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి సరిచేస్తే మంచిది లేకపోతె విమర్శలపాలు కావడం తథ్యం..

Related posts

23 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు…

Ram Narayana

‘ఐబొమ్మ’ క్లౌడ్‌లో 21 వేల సినిమాలు.. విచారణలో విస్తుపోయే నిజాలు!

Ram Narayana

మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం… టీవీ నటి పవిత్ర దుర్మరణం..

Ram Narayana