జాతీయ వార్తలు

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణంl

ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా మొత్తం ఆరుగురు మరణించినట్టు సమాచారం.   

వివరాల్లోకి వెళితే.. ఈ విమానం బుధవారం ఉదయం ముంబై నుంచి బయలుదేరింది. సుమారు గంట ప్రయాణం తర్వాత, 9 గంటల సమయంలో బారామతి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి కుప్పకూలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బారామతిలో జరగనున్న నాలుగు ముఖ్యమైన బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈరోజు అక్కడికి వెళుతున్నారు. 

ప్రమాద స్థలం నుంచి వస్తున్న దృశ్యాల్లో మంటలు, దట్టమైన పొగ కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.  

Related posts

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

Ram Narayana

మహిళా ఎంపీతో క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి

Ram Narayana

జగన్ ను కలిసిన నందీపుర పీఠాధిపతులు…

Ram Narayana