అంతర్జాతీయం

భారత్ తో ముగిసిన ట్రంప్ టారిఫ్ యుద్ధం …

  • అదనపు టారిఫ్ లను తగ్గించిన ట్రంప్.. ఇకపై 18 శాతం పన్ను వసూలు
  • ట్రేడ్ డీల్ నేపథ్యంలో శుక్రవారం అమెరికా అధ్యక్షుడి ప్రకటన
  • రష్యా చమురు దిగుమతుల నిలిపివేతకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడి
  • 25 శాతం ప్రతీకార సుంకాలను తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో ఇంతకాలం భారత్ తో ట్రంప్ చేసిన టారిఫ్ యుద్ధం ముగిసినట్లయింది. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డీల్ లో భాగంగా 7 శాతం టారిఫ్ లను ట్రంప్ తగ్గించిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో భారత్ పై అమెరికా పన్నుల భారం 18 శాతానికి తగ్గింది.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ట్రంప్ అప్పట్లో ప్రతీకార సుంకాలు విధించారు. ఆయా దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అయ్యే వస్తుసేవలపై 25 శాతం పన్నులు విధించి అమలు చేశారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. దీనికితోడు భారత్ పై అదనపు సుంకాలు మరో 25 శాతం విధించారు.

మొత్తంగా 50 శాతం టారిఫ్ లు విధించడంతో భారత ఎగుమతిదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల కుదరిన ట్రేడ్ డీల్ తర్వాత అదనపు సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. దీంతో భారత్ పై ప్రతీకార సుంకాలు 25 శాతం, అదనపు సుంకాలను 18 శాతం అమెరికా అధికారులు వసూలు చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇకపై భారత వస్తుసేవల మీద కేవలం 18 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయనున్నారు.

ట్రంప్ కు ధన్యవాదాలు చెప్పిన మోదీ.. గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్

Narendra Modi Thanks Trump for India US Trade Deal
  • ట్రేడ్ డీల్ పై ఇరు దేశాల సంయుక్త ప్రకటనను స్వాగతించిన ప్రధాని
  • ఇరు దేశాలకూ ప్రయోజనమని వ్యాఖ్య
  • మహిళలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడి

భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మధ్యంతర ఒప్పందం ఖరారు కావడం వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ‘గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా, అమెరికా’ అని ట్వీట్ చేస్తూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పారు.

ట్వీట్ ఇదే..
‘‘భారత్‌, అమెరికాల మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్ కు ఫ్రేమ్ వర్క్ ఖరారు చేశాం. ఇది అమెరికా, భారత్.. రెండు దేశాలకూ శుభవార్త. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పేందుకు నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్‌ కు కృతజ్ఞతలు. ఈ ఒప్పందం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారత్‌ లోని రైతులు, స్టార్టప్‌ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలను, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

Related posts

టంగ్ స్లిప్ … ఇరుక్కున్న భారత యూట్యుబర్

Ram Narayana

కెన్యాలో తెగిపోయిన డ్యామ్​.. 42 మంది మృతి..

Ram Narayana

ఆర్థిక వృద్ధి రహస్యం ఛేదించారు… అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటన!

Ram Narayana