తెలంగాణ వార్తలు

ఓ ఆర్ ఆర్ పై టోల్ బాదుడుకు సర్కార్ సన్నాహాలు …వాహనాల సంఖ్య పెరుగుతున్న ఈ పెంపుడేమిటి ..

  • ఓ ఆర్ ఆర్ పై టోల్ బాదుడుకు సర్కార్ సన్నాహాలు …వాహనాల సంఖ్య పెరుగుతున్న ఈ పెంపుడేమిటి ..
  • ఏప్రిల్ 1 నుంచి ఓఆర్ఆర్‌పై పూర్తిగా క్యాష్‌లెస్ లావాదేవీలు
  • టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల విధానం రద్దు
  • ఫాస్టాగ్ లేనివారు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు
  • రెండేళ్ల తర్వాత టోల్ చార్జీలను పెంచేందుకు సన్నాహాలు
  • 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం

ఓ ఆర్ ఆర్ పై టోల్ బాదుడుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తుంది …వచ్చే ఏప్రిల్ నుంచి టోల్ రేట్లు సవరించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తుంది …వాహనాలు సంఖ్య విఫరీతంగా పెరుగుతున్న టోల్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏమి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ..ఇది ఒకరకంగా చెప్పాలంటే వాహనదారులను దోపిడీ చేయడమే అవుతుందనే విమర్శలు ఉన్నాయి..నేషనల్ హైవే పెట్టిన విధంగా లోకల్ టోల్ ప్లాజాలకు కూడా సంత్సరానికి ఒకసారి వసూల్ చేసే పద్దతి వస్తే మంచిదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి..

హైద్రాబాద్ హైవే పై టోల్ ప్లాజాల వద్ద ఇక నుంచి కాష్ లెస్ విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించింది ..దీంతో ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పడుతున్నరద్దీని తగ్గించవచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు ..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 1 నుంచి ఓఆర్ఆర్‌పై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇకపై ఫాస్టాగ్ లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే టోల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్యాష్‌లెస్ విధానాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఆటోమేటిక్‌గా స్కాన్ అవుతుండగా, ఫాస్టాగ్ లేనివారు నగదు చెల్లించే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నగదు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నారు. అలాంటి వారు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఓఆర్ఆర్‌పై పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, కోకాపేట, శంషాబాద్‌తో సహా మొత్తం 19 ఇంటర్‌ఛేంజ్ టోల్ ప్లాజాలను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్వహిస్తోంది.

నగదు నిర్వహణ, రవాణా, భద్రపరచడం వంటి సమస్యలతో పాటు చిల్లర విషయంలో ప్రయాణికులకు, సిబ్బందికి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయని హెచ్‌జీసీఎల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత లోపించడం, దొంగతనాల వంటి భద్రతాపరమైన సమస్యలను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

రెండేళ్ల తర్వాత టోల్ రేట్ల పెంపు
మరోవైపు ఓఆర్ఆర్‌పై టోల్ చార్జీలను కూడా 2026 ఏప్రిల్ 1 నుంచి పెంచే అవకాశం ఉంది. చివరిసారిగా 2024 ఏప్రిల్‌లో టోల్ రేట్లను సవరించారు. వివిధ కారణాల వల్ల 2025 ఏప్రిల్‌లో పెంపును చేపట్టలేదు. దీంతో రెండేళ్ల విరామం తర్వాత సవరించిన టోల్ రేట్లు అమల్లోకి రానున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Related posts

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు….

Ram Narayana

అతి త్వరలో తన అరెస్ట్ ఉండబోతుంది .. కేసీఆర్ సంచలన ప్రకటన!

Ram Narayana

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు…అసలు రహస్యమేమిటి ….!

Drukpadam