అంతర్జాతీయం

‘కిడ్నాప్’ కు ఆధారాల్లేవు.. చోక్సీకి షాక్ ఇచ్చిన యూకే కోర్టు…

  • రూ.7 కోట్లకు సెక్యూరిటీ బాండ్ ఇవ్వాలని ఆదేశాలు
  • ఆంటిగ్వాలో తనను కిడ్నాప్ చేశారంటూ చోక్సీ పిటిషన్
  • ప్రత్యక్ష సాక్షులు లేరని వ్యాఖ్యానించిన కోర్టు

పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి యూకే కోర్టు షాకిచ్చింది. ఆయన చెబుతున్న ‘కిడ్నాప్’ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. చోక్సీ ఆరోపణలే తప్ప ఆయన కిడ్నాప్ కావడం ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరని చెప్పింది. చోక్సీ లాయర్ చూపించిన సందర్భోచిత సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగిస్తామని పేర్కొంటూ.. రూ.7.3 కోట్లు సెక్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలని చోక్సీని ఆదేశించింది.

కేసు ఏంటంటే..
విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ కొంతకాలం ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో తనను భారత్ కు తరలించేందుకు కొంతమంది కుట్ర పన్నారని చోక్సీ ఆరోపించారు. హంగేరీకి చెందిన బార్బారా జబారికతో కలిసి భారత ఏజెంట్లు తనను కిడ్నాప్ చేశారని యూకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జబారిక తనతో స్నేహం నటించి ఆంటిగ్వా నుంచి బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లిందని, తప్పించుకుని బయటపడిన తనను బెల్జియం పోలీసులు అరెస్టు చేశారని చోక్సీ చెప్పాడు.

Related posts

అసలు వారం రోజులు చాలు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Ram Narayana

మేం పాకిస్థాన్ కు విమానం నిండా ఆయుధాలు పంపించామన్నది వట్టి మాట: చైనా

Ram Narayana

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 71 మంది సజీవ దహనం

Ram Narayana