శివయ్య సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం,నేరడ గ్రామాలలో ఉన్న శివాలయాలను సందర్శించి ప్రదానాలు చేశారు .. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సుభిక్షంగా ఉంచాలని, ప్రజలందరిని చల్లగా చూడాలని పరమశివుడిని ప్రార్థించారు. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడమే కాకుండా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు కూడా పెరిగి జీవన పరిస్థితులు మెరుగుపడి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి త్రీ మిలియన్ డాలర్ ఎకానమీగా దాటే స్థాయిలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ఆ మహాదేవుని వేడుకున్నారు.
వైరా మండలం స్నానా లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మహాశివరాత్రి సందర్భంగా వచ్చి ఈ నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢమైన నమ్మకం.
మూడు రోజులపాటు స్నానాలు లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగే తిరునాళ్లకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు కావలసిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం కావలసిన వసతులను, ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమశివుని దర్శించుకుని ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

చింతకాని మండలం నేరేడ గ్రామంలో డిప్యూటీ సీఎం పర్యటించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో వెలసిన శివాలయాన్ని సందర్శించిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
భక్తిశ్రద్ధలతో శివార్చన
ఆలయానికి చేరుకున్న భట్టి విక్రమార్క దంపతులకు ఆలయ పండితులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణల మధ్య సాదర స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో శివపార్వతులకు దంపతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఉత్సాహంగా కబడ్డీ పోటీల ప్రారంభం
ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. మైదానంలోకి వెళ్లిన భట్టి, ఇరు రాష్ట్రాల క్రీడాకారులను వ్యక్తిగతంగా పరిచయం చేసుకుని, వారిని అభినందించారు. స్వయంగా టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన ఆయన, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారు. ఆట ప్రారంభమైన తర్వాత భట్టి విక్రమార్క దంపతులు కాసేపు అక్కడే ఉండి ఎంతో ఆసక్తిగా, సరదాగా కబడ్డీ పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు భారీ సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు.