ప్రమాదాలు ...హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు…

  • అధిక వేడి కారణంగా స్టీమర్ పేలినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
  • బయటకు పరుగుతీసిన సిబ్బంది, కస్టమర్లు
  • ప్రమాదంలో ముగ్గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. అధిక వేడి కారణంగా ఇడ్లీ స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎల్బీనగర్‌లోని ఆర్కేపురం చట్నీస్ హోటల్‌లో మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు చోటు చోసుకోవడంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు బయటకు పరుగు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు కిచెన్‌ను పరిశీలించాయి.

Related posts

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్ధం…!

Ram Narayana

చత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. 13 మంది దుర్మరణ!

Ram Narayana

అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన!

Ram Narayana