ప్రమాదాలు ...

చత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. 13 మంది దుర్మరణ!

  • ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు
  • తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు మృతి
  • మరో 30 మందికి గాయాలు
  • రాయ్‌పుర్ – బలోద బజార్ మార్గంలో దుర్ఘటన

చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయ్‌పూర్ – బలోద బజార్ మార్గంలో ఈ రోజు వేకువజామున జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు.

బాధితులు ఓ వివాహ వేడుకకు హాజరై చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Related posts

యువకుడి ఛాతిలో బాణం.. ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు..

Ram Narayana

జ‌గిత్యాల‌ రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళా ఎస్సై దుర్మ‌ర‌ణం!

Ram Narayana

బొగ్గు గనిలో పేలుడు…16 మంది మృత్యువాత…

Ram Narayana