అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధి మూసివేత!: ఆకాశానికి చమురు ధరలు.. బ్యారెల్‌కు 100 డాలర్లు దాటే ప్రమాదం!

  • బ్రెన్ట్ క్రూడ్ ఆయిల్ ధర 8 నెలల గరిష్టానికి
  • సోమవారం నాటికి 20 డాలర్ల వరకు పెరిగే ఛాన్స్
  • చమురు నిల్వలపై భారత్ అత్యవసర ప్రణాళిక
  • ద్రవ్యోల్బణం పెరిగే అవకాశంపై నిపుణుల హెచ్చరిక

గత శుక్రవారమే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెన్ట్ క్రూడ్ ధర ఏడు నెలల గరిష్ట స్థాయి 72.87 డాలర్ల వద్ద ముగిసింది. అయితే, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల పరిణామాలు, హోర్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో సోమవారం మార్కెట్లు తిరిగి ప్రారంభమయ్యే సరికి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 80 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు చేరవచ్చని ‘బ్లూమ్‌బెర్గ్’, ‘రైస్టాడ్ ఎనర్జీ’ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధర బ్యారెల్‌కు 10 డాలర్లు పెరిగితే, భారత్ అదనంగా దాదాపు $13-14 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.15 లక్షల కోట్లు) భారాన్ని భరించాల్సి ఉంటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.

పరిస్థితిని గమనిస్తున్న భారత ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అత్యవసర పరిస్థితుల కోసం మన దగ్గర ఉన్న ‘స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్’ (చమురు నిల్వలు) సుమారు 74 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Related posts

ఆ దేశం వెరీ డేంజర్… అక్కడికి వెళ్లొద్దంటూ తమ పౌరులకు అమెరికా హెచ్చరిక!

Ram Narayana

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ సంచలనం..

Ram Narayana

ఇజ్రాయెల్ పై దాడికి కీలక ఆయుధాన్ని తీసిన ఇరాన్.. ఫత్తా -1 మిసైల్ వివరాలు

Ram Narayana