జాతీయ వార్తలు

బెంగళూరులో సిలిండర్ల దొంగలు.. కొరత భయంతో కొత్త తరహా చోరీలు…

బెంగళూరు నగరంలో గ్యాస్ సిలిండర్ల చోరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత ఏర్పడవచ్చనే ప్రచారం నేపథ్యంలో, దొంగలు గ్యాస్ బండలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు యువకులు ఓ ఇంట్లో చొరబడి, గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ద్విచక్ర వాహనాలపై వస్తున్న నిందితులు, ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని ఇంట్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటి ఆవరణలో లేదా బయట ఉంచిన సిలిండర్లను ఒక గోనె సంచిలో చుట్టి చాకచక్యంగా ఎత్తుకెళ్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ నగర్, చన్నపట్న వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి.

ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాల వల్ల బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర భారీగా పలుకుతోంది. దీన్నే ఆసరాగా చేసుకున్న దొంగలు సులభంగా డబ్బు సంపాదించేందుకు సిలిండర్లను ఎత్తుకెళుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దొంగతనాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు తమ గ్యాస్ సిలిండర్లను ఇంటి బయట వదిలేయవద్దని, వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related posts

జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కేబినెట్ తీర్మానం!

Ram Narayana

ఆ ఒక్క మాటతో మనసులు గెలిచాడు.. ఇండిగో పైలట్‌పై ప్రశంసల వర్షం..!

Ram Narayana

మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం …

Ram Narayana