జాతీయ రాజకీయ వార్తలు

సాయంత్రం కేరళంకు వెళుతున్న రేవంత్ రెడ్డి…

వచ్చే నెలలో కేరళంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేరళంలో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది. ఈ సాయంత్రం ఆయన కేరళంకు బయలుదేరి వెళ్లనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని, ఇప్పుడు కేరళంలో ‘స్టార్ క్యాంపెయినర్’గా నియమించారు. ఆయన వాగ్ధాటి, మాస్ అప్పీల్ కేరళ ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటుందని ఏఐసీసీ భావిస్తోంది. రెండు రోజుల పాటు ఆయన అక్కడ విస్తృతంగా పర్యటించి, పలు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.

కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా, తెలంగాణకు చెందిన పలువురు కీలక మంత్రులకు కూడా కేరళం ఎన్నికల బాధ్యతలను అధిష్ఠానం అప్పగించింది. ఎర్నాకులం, హోసూరు జిల్లాల ఇన్ఛార్జిగా నియమితులైన శ్రీధర్ బాబు ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించనున్నారు. మరో మంత్రి పొంగులేటి ఇప్పటికే కేరళంకు చేరుకున్నారు. పతినంతిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్మల నియోజకవర్గాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈయన కూడా ఏప్రిల్ 7 వరకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.

Related posts

బీహార్ లో ఊహకందని ఫలితాలు ..లెక్కలు తప్పిన ఎగ్జిట్ పోల్స్..

Ram Narayana

మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్…?

Ram Narayana

ఢిల్లీలో నెహ్రూ పేరిట ఉన్న మ్యూజియం పేరు మార్పు

Ram Narayana