జాతీయ రాజకీయ వార్తలు

బెంగాల్ లో ఫలించిన బీజేపీ వ్యూహం …ఇక తెలంగాణపై గురి

బెంగాల్ లో ఫలించిన బీజేపీ వ్యూహం …ఇక తెలంగాణపై గురి

బెంగాల్ లో బీజేపీ వ్యూహం ఫలించింది . .ఇక తెలంగాణపైనే తమ గురి అని బీజేపీ శ్రేణులు చెపుతున్నాయి ..ఇక వారు దక్షణాధిలో తమకు బలంగా ఉన్న కర్ణాటకతోపాటు తెలంగాణను ఫోకస్ పెట్టారు … కర్ణాటక ఎలాగూ తమ ఖాతాలో చేరుతుందని ధీమాతో ఉన్నారు .. తెలంగాణాలో తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు .. బెంగాల్ తర్వాత తమ టార్గెట్ తెలంగాణనే అని బీజేపీ వర్గాలు అంటున్నాయి .. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేసిందెకు ఇప్పటినుంచే రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఈనెల 10 న తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాన నరేంద్రమోదీ చేతుల మీదిగా అనేక శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉండబోతున్నాయి … డబులు ఇంజన్ సర్కార్ ఉంటె అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు దూసుకొని పోతుందని వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ఇప్పటికే కమలానాథాలు సంబరపడిపోతున్నారు … ప్రధాని సభ ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది .. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సమానంగా 8 లోకసభ సీట్లు గెలుచుకున్న బీజేపీ తెలంగాణలో అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతుంది…

గత ఎన్నికల్లో చిక్కినట్లే అనిపించి టీఎంసీ ఖాతాలోకి వెళ్ళిన బెంగాల్ న ఈసారి ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దని నిర్ణయించుకున్న కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవరించడం ద్వారా ఈసారి వడిసి పట్టుకున్నారు .దీదీని ఎట్టకేలకు గద్దె దింపి తమ పంతం నెగ్గించుకున్నారు … టీఎంసీ , బీజేపీ మధ్య 10 నుంచి 20 సీట్ల తేడా మాత్రమే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా అందుకు భిన్నంగా 207 సీట్ల గెలవడం ద్వారా 125 కు పైగా సీట్ల మెజార్టీ తో బీజేపీ టీఎంసీ కోటలో కషాయం జెండాను రెపరెపలాడించారు .టీఎంసీ కి కేవలం 80 సీట్ల దగ్గర అటు ఇటు వేలాడుతున్నారు …దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఆనందం కంటే బెంగాల్ గెలవడం బీజేపీకి గొప్ప ఆనందనాన్ని ఇచ్చింది . ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్ట్రర్ లో ఘనంగా విజయోత్సవ సభ నిర్వహించారు ..ప్రధాని మోడీ స్వయంగా హాజరై బెంగాల్ లో కొత్త శకం మొదలైందని అన్నారు .. దీంతో భారత రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించినట్లు అయింది . దేశంలో రాజకీయాలకు బీజేపీకి మోడీ -అమిత్ షా ద్వయానికి తిరుగులేదని వారి ఎత్తులు ,వ్యూహాల ముందు అందరు బలాదూరే అనే అభిప్రాయాన్ని కల్పించారు ..అందుకు బీజేపీ పోటీ అంటే గెలుపే అని ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేశారు ..

ఇక అస్సోమ్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని కోరుకున్న కాంగ్రెస్ కు ఈసారి కూడా శృంగభంగం తప్పలేదు …126 సీట్లు ఉన్న అసెంబ్లీలో 100 కు పైగా సీట్లలో గెలిచి సత్తా చాటింది …కాంగ్రెస్ కు కేవలం 21 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ..

పుదుచ్చేరి లో బీజేపీ అనుకూల ప్రభుత్వం తిరిగి కొలువు దీరనున్నది …30 సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ లో ఎన్డీయే కూటమి 17 సీట్లు గెలుచుకున్న రంగస్వామి తిరిగి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ..కాంగ్రెస్ కు కేవలం 6 సీట్లు మాత్రమే వచ్చాయి ..తమిళనాడు లో టీవీకే పార్టీ పెట్టిన సినీనటుడు విజయ్ ప్రభంజనం సృష్టించారు ….234 సీట్లు ఉన్న అసెంబ్లీ లో టీవీకే పార్టీకి 107 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది …దీంతో చిన్న పార్టీలను కలుపుకొని అధికారంలోకి రావడానికి పావులు కదుపుతుంది …

కేరళం లో తిరిగి అధికారంలోకి రావడం ద్వారా చరిత్ర సృష్టించాలని కలలు గన్న ఎల్డీఫ్ కు పరాభవం తప్పలేదు … 140 సీట్లు ఉన్న అసెంబ్లీ లో కాంగ్రెస్ 102 సీట్లు గెలుచుకోవడం ద్వారా గ్రాండ్ విక్టరీ సాధించారు …సిపిఎం నాయకత్వంలోని ఎల్డీఫ్ కు కేవలం 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది …దీంతో దేశంలో ఉన్న ఒక్క ఎర్రజెండా ప్రభుత్వం పోయినట్లు అయింది ..

Related posts

హిందీ నేర్చుకుంటే తప్పేమిటి అన్న చంద్రబాబు …

Ram Narayana

స్వపక్షంలో విపక్షం శశిథరూర్ రూటే సపరేటు …రాహుల్ గాంధీ మాటలకూ కౌంటర్!

Ram Narayana

బీజేపీ, డీఎంకే పార్టీలపై నటుడు విజయ్ తీవ్ర విమర్శలు…

Ram Narayana