జాతీయ రాజకీయ వార్తలు

దేశంలో అధికారం నుంచి లెఫ్ట్ అయిన రెడ్ …50 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

భారత రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన వామపక్షాలు, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని విచిత్రమైన  పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత ఐదు దశాబ్దాల్లో ఇలాంటి రాజకీయ శూన్యం ఏర్పడటం ఇదే తొలిసారి కానుంది. తమ చివరి కంచుకోట అయిన కేరళలోనూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్‌) ఘోరంగా  అధికారం కోల్పోయింది . దీంతో  కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది.

దేశంలో సోషలిజం తేవాలని ,అందుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకొని రేపోమాపో ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేస్తామని చెప్పిన ఎర్రజెండా పార్టీలు చివరకు దేశంలో మిగిలి ఉన్న ఒక్క కేరళం నుంచి లెఫ్ట్ కావడం వామపక్ష శ్రేణులకు తీవ్ర నిరాశ ,నిస్పృహ కలిగించే అంశం …50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో   లెఫ్ట్ పార్టీ బెంగాల్ , కేరళ , త్రిపుర రాష్ట్రాలను పరిపాలించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధాని పదవిని సైతం శాసించిన లెఫ్ట్ పార్టీలు  ఘోరంగా అవమానకరంగా అధికారాన్ని కోల్పోవడం జీర్ణించుకోలేని  విషయం…70 పదులు పై బడ్డ వయస్సును సైతం లెక్క చేయకుండా ఎండల్లో సైతం ఎర్రజెండా పార్టీ అధికారంలోకి  రావాలని పేదప్రజలకు మేలు చేయాలనీ ప్రచారాన్ని భుజాలకు ఎత్తుకొని  కాలినడకన అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న బిమన్ బసు,తన వయస్సును సైతం లెక్క చేయక రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు జరిపిన  ,పిన్నరవి  విజయన్ లను అభిఅందించాలిసిందే …ఈ అపజయాల నుంచి  లెఫ్ట్ గుణపాఠాలు తీసుకోవాలి  …పార్టీని క్యాడర్ ను ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీర్చుదిద్దాలి ..ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగించి , తిండి ,బట్ట ,గూడు ఉండే సమసమాజాన్ని ఏర్పాటు చేస్తామని ,అందుకు ఎర్రజెండా పార్టీలనన్నిటిని ఏకం చేస్తామని భరోసా కల్పించాలి … భూర్జువ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా సీట్లు ఓట్ల లెక్కలు ఎర్రజెండా పార్టీలోతోనే తేల్చుకోవాలి  ..అప్పుడే ప్రజల్లో  విశ్వాసం కలుగుతుందనే విషయాన్నీ గమనించాలి ..ఎవరికీ వారు సిద్ధాంత రంద్దాంతాల పేరుతో చీలిపోయి చెట్టుకొకరు ,పుట్టకొకరులా ఉంటె అసలు ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది …చిన్న చిన్న సమస్యలు ఉంటె చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు …ఎర్రజెండాలను ప్రేమించే వారిని ఐక్యం చేయండి ..అప్పుడే ప్రజల్లో విశ్వాసం పొందగలరు ..

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం.. ఇప్పుడు అధికారం శూన్యం ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలది కీలక పాత్ర. 1996లో సీపీఎం అగ్రనేత జ్యోతి బసు యునైటెడ్ ఫ్రంట్ తరఫున ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, పార్టీ పొలిట్‌బ్యూరో ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీనిని ఆయన తర్వాత ‘చారిత్రక తప్పిదం’గా అభివర్ణించారు. 2008లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర.. ఇలా మూడు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయి. భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ చరిత్ర భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులది సుదీర్ఘ, ప్రభావవంతమైన చరిత్ర. 1957లో కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంగా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇక, పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2011 వరకు ఏకధాటిగా 34 ఏళ్లు పాలించి, దేశంలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా చరిత్రకెక్కారు. జ్యోతి బసు ఒక్కరే 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే, త్రిపురలోనూ 1993 నుంచి మాణిక్ సర్కార్ నేతృత్వంలో వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గిన వామపక్షాల ప్రాభవం అయితే, గత దశాబ్ద కాలంగా వామపక్షాల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సింగూర్, నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమాల నేపథ్యంలో 2011లో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ చేతిలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత 2018లో బీజేపీ ప్రభంజనంలో త్రిపుర కోట కూడా బద్దలైంది. దీంతో కేరళ ఒక్కటే వామపక్షాలకు చివరి ఆశగా మిగిలింది. 2021లో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి పినరయి విజయన్ సంచలనం సృష్టించారు. అయితే, తాజా ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉండటంతో వామపక్షాల పాలన శకం తాత్కాలికంగా ముగింపు దశకు చేరుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులు తీసుకునే నిర్ణయం ఆ పార్టీల భవిష్యత్ ను తేల్చనున్నది …ఎర్రజెండాలను ఏకతాటిపైకి తేవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యంగా గుర్తించి  ముందుకు పొతే ప్రజలు వాటి వెనక ర్యాలీ అవవుతారు లేకపోతె కొత్తపార్టీలు వచ్చి వారిని మనుగడను ప్రశ్నర్ధకంగా మార్చే అవకాశం లేకపోలేదు సుమా …!

Related posts

కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే చోటు…!

Ram Narayana

రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ… అదృష్టం అంటే ఆయనదే!

Ram Narayana

ముఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలే కొంప ముంచాయని కాంగ్రెస్ నిర్ధారణ

Ram Narayana