తుమ్మలకు హిడెన్ ఎజెండా ఉందా…?ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థిగా తుమ్మల అవుతారా …??
40 సంవత్సరాల రాజకీయ జీవితంపై ఖమ్మంలో భారీ ఆత్మీయ సమావేశం ..
తెలంగాణ అంతటా వెలిసిన తుమ్మల భారీ ప్లేక్సీలు ..
ఆయన అభిమానుల హంగామా …? ,సభలు, సమావేశాలు

తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ రాజకీయంగా నాయకుడు … రాజకీయ దురంధరుడు … రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు… 1986 మే 14 న ఎన్టీఆర్ మంత్రివర్గంలో మొదటిసారి మంత్రిగా చేరి 40 సంవత్సరాలు దాటింది …అందులో 20 సంవత్సరాలకు పైగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది …నాటి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు , కేసీఆర్ , నేటి రేవంత్ రెడ్డి వరకు పార్టీలు ఏరైనా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం . ఇంత సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన నాయకుడు రెండు రాష్ట్రాల్లో మరొకరు లేరు ..ముక్కుసూటి తనం .పరిపాలనలో గణనీయమైన పట్టు , వెరసి ఆయనకు కొత్త ఆలోచనలు కలిపిస్తుందా …? ఆయనకు హిడెన్ ఎజండా ఉందా…ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థిగా తుమ్మల అవుతారా …?? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు .. ఆయన సరికొత్త భవిష్యత్ వ్యూహంతోనే రాజకీయ అడుగులు వేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న తుమ్మల, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు ..ఆయన మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేసి 40 సంవత్సరాల అయిన సందర్భంగా ఈనెల 13 న ఖమ్మంలో అభిమానులు భారీ ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు ..దానికి పెద్ద ఎత్తున సమీకరణ చేశారు. తనకు ఇలాంటి కార్యక్రమాలు ఇష్టంలేవని సభలోనే తుమ్మల కుండబద్దలు కొట్టారు ..స్టేజ్ పై ఎవరితోనూ ఆయన సన్మానం చేయించుకోలేదు ..వందలమంది తెచ్చిన శాలువాలు , బొకేలు తిరిగి తీసుకోని పోవడం వారి వంతు అయింది ..ఈ ఆత్మీయ సభకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని ,ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఎవరు హాజరు కాలేదు .. కొత్తగూడెం కు చెందిన సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హాజరైయ్యారు .. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ,సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ,టీ జి ఓ నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు , సిపిఐ నాయకులు భాగం హేమంతరావు ,మహమ్మద్ మౌలానా ,తదితరులు పాల్గొని తుమ్మలకు అభినందనలు తెలిపారు .. ఆయన మాత్రం చివరిలో స్టేజిపైకి వచ్చి అతి క్లుప్తంగా కేవలం 3 నిమిషాలలోపు చేసిన తన ప్రసంగంలో భావోద్యేగంతో కన్నీటి పర్వవంతం అయ్యారు… మీ ప్రేమ అనురాగలవల్లనే ఇంతవాణ్ని అయ్యానని, ఇదే అభిమానం భవిష్యత్ లో కూడా చూపించాలని విజ్ఞప్తి చేశారు .. తన ప్రసంగంలో కుటుంబ ప్రస్తావన కూడా తెచ్చారు …తాను ఏమి సంపాదించలేదని తన కుటుంబం ఆపాదిస్తుందని అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా తిరుగుతున్నానని అన్నారు …తుమ్మలకు 7 పదుల వయస్సు దాటింది . రెండు మూడు సార్లు ఆరోగ్యం దెబ్బతిన్నది , ఆక్సిడెంట్ అయినా కోలుకున్నారు ..కానీ నాటి చురుకుదనం , చలాకీతనం తగ్గలేదు ..మరో 10 సంత్సరాలు ఆయన రాజకీయ జీవితానికి డోకా లేదన్నట్లుగా తిరుగుతున్నారు ..

తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది …తెలంగాణాలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో టీడీపీ ,బీజేపీ ,జనసేన కలిసి ఎన్డీయే పేరుతో తెలంగాణాలో అధికారంలోకి రావాలని ఎత్తులు వేస్తుంది ..అందులో భాగంగానే ఇటీవల ప్రధాని మోడీ వచ్చి ఇక్కడ నాయకత్వానికి బూస్టింగ్ ఇచ్చారు … బీజేపీ ఉన్న 33 జిల్లాల్లో కొన్ని జిల్లాలకే పరిమితమైంది …అధికారంలోకి రావాలనుంటే ప్లాన్ మార్చాల్సిందే …అందుకు ఏపీలోలాగానే ఇక్కడ ఎన్డీయేకి ప్రాణం పోయాలని వ్యూహరచనలు చేస్తుంది ..రాష్ట్రంలో కీలక నేతలను ఎంపిక చేసికొని వారిని బీజేపీలో చేరేలా పావులు కదుపుతుంది …అది వీలు కాకపోతే టీడీపీ,జనసేన పార్టీల సహాయం తీసుకోని ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు .. అందుకు సీనియర్ నాయకుడిగా ఉన్న తుమ్మల లాంటి రాజకీయ ఉద్దండులను తమ కూటమిలోకి ఆహ్వానించి వారికీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తారనే గుసగుసలు కూడా బయలుదేరాయి.. ఇందుకు ఒక పత్రికాధిపతి తన వంతు సహకారం అందించే అవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం .. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు …ఇప్పుడు బీజేపీ తో పొత్తుతో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఏపీలో అధికారంలో వచ్చిన తర్వాత కొంత ఆశ కల్గింది .తెలంగాణాలో పార్టీని పటిష్టం చేస్తామని చంద్రబాబు ఇక్కడ నాయకత్వానికి భరోసా ఇచ్చారు ..అందువల్ల తెలంగాణాలో గణనీయమైన ఓటింగ్ కలిగిన టీడీపీలోకి తుమ్మలలాంటి సీనియర్ నాయకున్ని తిరిగి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ , బీఆర్స్ పార్టీలకు ప్రత్యాన్మాయం కావచ్చునని బీజేపీ భావిస్తుంది ..ఇటీవల తుమ్మల ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు .. ఖమ్మం ఆత్మీయ సభలో భద్రాచలం శ్రీ సీతారాముల పాదాల చెంత అంటున్నప్పుడు బ్యాక్ స్క్రీన్ పై భద్రాచలం శ్రీసీతారాములవారి విగ్రహాలను చూపించారు .. అందువల్ల రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు వైట్ అండ్ సి …