ఆంధ్రప్రదేశ్

నా చెల్లెలు అమెరికా వెళ్తానంటే.. నాకంటే ముందే పంపించారు: కేటీఆర్

నా చెల్లెలు అమెరికా వెళ్తానంటే.. నాకంటే ముందే పంపించారు: కేటీఆర్

  • అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలన్న కేటీఆర్
  • తన తల్లిదండ్రులు తన చెల్లెల్ని కూడా బాగా చదివించారని వ్యాఖ్య
  • తాము కూడా తమ పిల్లల్ని సమానంగా చూస్తున్నామన్న కేటీఆర్

అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలని… అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని అన్నారు. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనే ఆలోచనను మన ఇంటి నుంచే నేర్పిస్తున్నామని, ఇది సరికాదని చెప్పారు. తన తల్లిదండ్రులు తననే కాకుండా, తన చెల్లెలు కవితను కూడా బాగా చదివించారని… ఇద్దరినీ సమానంగా పెంచారని అన్నారు.

కవిత అమెరికాకు వెళ్తానంటే తన కంటే ముందే ఆమెను అక్కడకు పంపించారని చెప్పారు. అలా తన కంటే ముందే కవిత అమెరికాకు వెళ్లిందని తెలిపారు. తాము కూడా తమ పిల్లలను సమానంగా చూస్తున్నామని అన్నారు. పిల్లలకు నమ్మకం కలిగిస్తే… వంద శాతం అభివృద్ధిని సాధిస్తారని చెప్పారు. ఇంజినీర్, డాక్టర్, లాయర్ కావాలని ఇంట్లో చెపుతుంటారని… వాళ్లు వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. హైదరాబాద్ వీ హబ్ 5వ వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేయబోతున్నామని చెప్పారు.

Related posts

తిరుపతి గంగమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు.. ఇక నుంచి రాష్ట్ర పండుగ!

Drukpadam

చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం 12న ఉద‌యం 11.27 గంట‌ల‌కే…

Ram Narayana

దివికేగిన పారిశ్రామిక దిగ్గజం ర‌త‌న్ టాటా…రాష్ట్రపతి ,ప్రధాని సంతాపం

Ram Narayana