Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్!

నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్!

  • నేపాల్ లో దేశాధ్యక్ష ఎన్నికలు
  • నేపాలీ కాంగ్రెస్ నేత పౌడెల్ ఘనవిజయం
  • ఎనిమిది పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన పౌడెల్

నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో రామచంద్ర పౌడెల్ విజయం సాధించారు. 214 మంది ఎంపీలు, 352 మంది శాసనసభ సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. రామచంద్ర పౌడెల్ నేపాలీ కాంగ్రెస్ పార్టీ నేత. ఎనిమిది పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన నేపాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. పౌడెల్ విజయం సాధించడం పట్ల నేపాలీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షేర్ బహదూర్ దేవ్ బా హర్షం వ్యక్తం చేశారు. నేపాల్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన నా మిత్రుడు రామచంద్ర పౌడెల్ కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

నేపాల్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం ఓట్లు 882. వారిలో 332 మంది పార్లమెంటు సభ్యులు కాగా, 550 మంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు.

నేపాల్ ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శాలిగ్రామ్ మాట్లాడుతూ… 518 మంది అసెంబ్లీ సభ్యులు, 313 మంది పార్లమెంటు సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. 2008లో నేపాల్ రిపబ్లిక్ గా అవతరించాక, దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది మూడోసారి.

Related posts

మధ్యప్రదేశ్ లో 150 సీట్లు గెలుస్తాం: రాహుల్ గాంధీ!

Drukpadam

హుస్నాబాద్ ఎమ్మెల్యే స‌తీశ్ కుమార్‌కు చేదు అనుభ‌వం!

Drukpadam

జోరుగా రాహుల్ భారత్ జోడో యాత్ర …పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్…

Drukpadam

Leave a Comment