రాజకీయ వార్తలు

అగ్రనాయకుల మధ్య చిచ్చుకు కారణమైన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీలు…

అగ్రనాయకుల మధ్య చిచ్చుకు కారణమైన కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ర్యాలీలు…

  • నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ లో ర్యాలీ చేపడుతామన్న రేవంత్ రెడ్డి
  • రేపు నల్లగొండలో ర్యాలీపై తనను సంప్రదించలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • షెడ్యూల్ ప్రకారమే ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు రేవంత్ ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ లో అగ్ర నాయకుల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేపు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై ఉత్తమ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. తనతో చర్చించకుండా, తన జిల్లాలో ఏ విధంగా సభ నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, ముందుగా ప్రకటించిన విధంగానే నిరసన ర్యాలీలను కొనసాగించాలని రేవంత్ తెలిపారు. ఈ నెల 21న నల్లగొండలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్ లో నిరసన ర్యాలీలు జరుగుతాయని స్పష్టం చేశారు.

Related posts

మిస్టర్ జగన్… నీ పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది: పవన్ కల్యాణ్…

Drukpadam

బండి సంజయ్ ను విడిచిపెట్టొద్దు.. పీడీ యాక్ట్ పెట్టాలంటూ ఆర్​ఎస్​ ప్రవీణ్​ సంచలన ట్వీట్!

Drukpadam

బీఆర్ యస్ తో పొత్తు కుదరకపోతే 119 సీట్లలో పోటీ…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని…

Drukpadam