వరంగల్ కాంగ్రెస్ లో తన్నుకున్న కార్యకర్తలు…
-వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు..
-ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాస
-ఫ్లెక్సీలో కొండా దంపతుల ఫోటోలు లేకపోవడంపై అనుచరుల ఆగ్రహం
-ఎర్రబెల్లి, కొండా వర్గాల మధ్య ఘర్షణ
కాంగ్రెస్ కు అధికారంలో ఉంటె ఒక చిక్కు ,లేకపోతె మరో చిక్కుల ఉంది. గ్రూపులుగా తన్నుకోవడం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు సర్వసాధారణమై పోయాయి. ఇదే తమ బలం అని చెప్పుకోవడం వారికీ ఫ్యాషన్ గా మారింది .కొట్టుకోవడం తమ బలమనేది ఒక్కప్పటి మాట నేడు రాజులు మారాయి. మనుషులు మారారు . అప్పడు కాంగ్రెస్ తప్ప దిక్కులేని పరిస్థితి ఉండేది .నేడు అది లేదు ..కానీ వారిలో మార్పు రావడంలేదు . ఇక కొండాదంపతులు తరుచు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు . ఎప్పటినుంచో కాంగ్రెస్ లో ఉన్న వారు గులాబీ పార్టీలో కూడా చేరారు . తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు . వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణను పార్టీ నియమించింది. ఆసందర్భంగా ఆమె భాద్యతలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా దంపతుల ఫోటోలు పెట్టకపోవడం గొడవకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు అక్కడ ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు .చెప్పులు విసురుకున్నారు. నినాదాలు గొడవలతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం తలపించేలా చేసింది. కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు నాయకులూ నానాతంటాలు పడ్డ వారి కోపం చల్లారలేదు . దీంతో కాంగ్రెస్ లో లొల్లి పై కొత్తగా పార్టీలోకి ఆకర్షితులౌతున్నవారు ఇదే కర్మరా బాబు అంటూ తలలు పట్టుకున్నారు . …
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొండా దంపతుల ఫొటోలు లేకపోవడంపై వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కొండా వర్గం, ఎర్రబెల్లి వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలవారు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు.