Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే..?

  • ఉస్మానియా యూనివర్శిటీలో పోస్ట్ మార్టం పూర్తి
  • పోలీసులకు ప్రాథమిక నివేదికను అందించిన వైద్యులు
  • తలకు బలమైన గాయం తగలడం వల్లే అప్సర చనిపోయిందన్న వైద్యులు

అప్సరను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె ప్రియుడు ఆమెను దారుణంగా హతమార్చాడు. అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో కాసేపటి క్రితం పోస్టుమార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య నేతృత్వంలోని బృందం పోస్టుమార్టం నిర్వహించింది. పోస్టుమార్టంకు సంబంధించిన ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు ఇచ్చారు. తలపై బలమైన గాయం తగలడం వల్లే అప్సర చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

అప్సర హత్య కేసులో మిస్టరీని తేల్చనున్న పోస్టుమార్టం రిపోర్టు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనుంది. అప్సర హత్యకు సంబంధించిన మిస్టరీని ఈ నివేదిక తేల్చేస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడనున్నాయని చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతురాలి తల్లిదండ్రుల సంతకాలు తప్పనిసరి కావడం, అప్సర తండ్రి కాశీ పర్యటనలో ఉండడంతో ఆలస్యం జరుగుతోందని వివరించారు.

దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి అప్సర మృతదేహం ఉస్మానియా మార్చురీలోనే ఉంది. అప్సర తండ్రి శనివారం తిరిగి వచ్చే అవకాశం ఉందని, ఆయన రాగానే డాక్టర్లు పోస్టుమార్టం మొదలుపెడతారని సమాచారం. అప్సరను దారుణంగా చంపేసిన సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం ఉదయం జడ్జి ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సాయికృష్ణను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. 

గుడికి వచ్చిన అప్సరతో పరిచయం పెంచుకున్న సాయికృష్ణ.. చనువుగా మసులుతూ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. అప్సర ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఆమె తల్లిని అక్కా అని పిలుస్తూ కుటుంబానికి దగ్గరయ్యాడని వివరించారు. ఈ క్రమంలో అప్సర గర్భందాల్చగా సాయికృష్ణ అబార్షన్ చేయించాడని, రెండోసారి కూడా గర్భం దాల్చడంతో ఇరువురి మధ్య వివాదం జరిగిందని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత కేసు కొలిక్కి రానుందని అధికారులు చెబుతున్నారు.

Related posts

పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రికి మంత్రి పువ్వాడ అజయ్!

Drukpadam

పర్యాటకుల ప్రాధాన్యం ‘గోవా’.. తర్వాత మనాలి!

Drukpadam

ఆధునికం పేరుతో అల్లోపతి ప్రాణాలు బలిగొంటుంది- బాబా రాందేవ్ మండిపడ్డ వైద్యవర్గాలు

Drukpadam

Leave a Comment