జాతీయ వార్తలు

లడఖ్ లో ఘోర ప్రమాదం… 9 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం

  • లోయలో పడిన సైనిక వాహనం
  • లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఘటన
  • సైనిక బలగాల కారు గారిసన్ నుంచి ఖేరీ వెళుతుండగా ప్రమాదం

లడఖ్ లో నేడు ఘోర ప్రమాదం సంభవించింది. ఓ సైనిక వాహనం లోయలో పడిన ఘటనలో 9 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

ఇవాళ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సైనిక బలగాల కారు గారిసన్ ప్రాంతం నుంచి ఖేరీ తరలి వెళుతుండగా అదుపుతప్పి, లోతైన లోయలోకి పడిపోయిందని అధికారులు వెల్లడించారు.

Related posts

మహిళా ఉద్యోగులకు కర్ణాటక సర్కార్ ‘పీరియడ్ లీవ్’ వరాలు…

Ram Narayana

విద్యార్థిని ఎందుకు దండించాల్సి వచ్చిందో చెప్పిన యూపీ టీచర్

Ram Narayana

తొక్కిస‌లాట‌పై మోదీ నాలుగు సార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి

Ram Narayana