జనరల్ వార్తలు ...

అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలి: టీసీఎస్ కీలక నిర్ణయం

  • హైబ్రిడ్ వర్క్‌కు ముగింపు పలికిన దేశీయ ఐటీ దిగ్గజం
  • వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావాలని ఆదేశం
  • సీఈవో, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ పేరిట ఈ-మెయిల్స్

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ హైబ్రిడ్ వర్క్‌కు ముగింపు పలికింది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులు అందరూ ఆఫీస్‌లకు రావాలని సూచించింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించినట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని కంపెనీ తెలిపింది.

కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత హైబ్రిడ్ విధానం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఉద్యోగులు మూడ్రోజులు ఆఫీస్‌కు వెళ్తూ, మిగతా రెండు రోజులు ఇంటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగులు ఐదు రోజులు కార్యాలయాలకు రావాలని కంపెనీ సీఈవో, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ పేరిట ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు.

Related posts

మెటా నిర్ణయంతో ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఇంతకీ ఏంటా నిర్ణయం?

Ram Narayana

ఇవి నిశ్శబ్ద వ్యాధులు… లక్షలాది మందిని కబళిస్తున్నాయి!

Ram Narayana

iPhone 8 off to bumpy start with iPhone X in the wings

Ram Narayana