ఆంధ్రప్రదేశ్

సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నా: ఈటల ప్రకటన

సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నా: ఈటల ప్రకటన
తెలంగాణలో నవంబరు 30న ఎన్నికలు
హుజూర్ నగర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఈటల సమావేశం
సీఎం కేసీఆర్ పై గజ్వేల్ బరిలో దిగుతున్నానని వెల్లడి
హుజూర్ నగర్ లోనూ పోటీ చేస్తానని వివరణ
రెండింట్లోనూ విజయం తనదేనని ధీమా

బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. తన ప్రస్తుత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు, కేసీఆర్ పై గజ్వేల్ లోనూ బరిలో దిగుతానని ప్రకటించారు. హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో కార్యకర్తలే అన్నీ నడిపించాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ లాగా తాను కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని, రెండింట్లోనూ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈటల ప్రకటనపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సీఎం కేసీఆర్ గజ్వేల్ తోపాటు కామారెడ్డి లో పోటీచేస్తున్నారు . దీంతో వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ..బీఆర్ యస్ లో ఈటెల పోటినేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లో పకడ్బందీగా ప్రచారం నిర్వహించాలని అందుకు స్థానిక నేతలే కాకుండా ప్రత్యేక ఇంచార్జిలను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం …

Related posts

అగ్నికి ఆహుతైన గిరిజన పల్లె.. సార్లంకపల్లెలో 38 ఇళ్లు భస్మం…

Ram Narayana

నారా లోకేశ్ పై రేపటి సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా

Ram Narayana

ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి…టీడీపీపై విజయసాయి ఫైర్

Ram Narayana