క్రైమ్ వార్తలు

కుక్క మొరుగుతోందని పక్కింటి వ్యక్తి క్రూరత్వం

  • శునకం ప్రైవేటు భాగంలోకి రాడ్ చొప్పించిన పక్కింటి వ్యక్తి
  • కొడుకుకి సహకరించిన తండ్రి.. భువనేశ్వర్‌లో దారుణం
  • కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పొరుగింటివారి కుక్కపై ఓ వ్యక్తి కర్కశంగా వ్యవహరించిన దారుణ ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. మొరుగుతోందనే ఒకే ఒక్క కారణంతో శునకం ప్రైవేటు భాగంలోకి ఐరన్ రాడ్‌ను చొప్పించాడు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ దారుణం బయటపడింది. నిందితుడి పేరు చందన్ నాయక్ అని, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.

కుక్కపై దాడి చేయడానికి నిందితుడు చందన్ నాయక్‌కు అతడి తండ్రి సహకరించాడు. దాడికి ముందు కుక్క యజమాని ఇంటి ముందుకెళ్లి తండ్రీకొడుకులిద్దరూ పెద్దపెద్ద కేకలు వేశారు. ఎందుకు అరుస్తున్నారంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కుక్క యజమానురాలి పట్ల తండ్రీకొడుకులు అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. సదరు మహిళను జుట్టుపట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు. బట్టలన్నీ చింపివేసే ప్రయత్నం చేశారు. ఆమెపై అత్యాచారానికి కూడా ప్రయత్నించారు. ఈ పరిణామాలను గమనిస్తున్న శునకం మరింత గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. దీంతో చందన్ నాయక్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఐరన్ రాడ్‌ను శునకం ప్రైవేటు భాగాల్లోకి చొప్పించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది.

Related posts

ప్రజాభవన్ బారికేడ్లు ఢీకొన్న కారు ఘటనలో ఎమ్మెల్యే కొడుకే నిందితుడు …!

Ram Narayana

రూ.50 లక్షల కోసం మాజీ ఎమ్మెల్యే బంధువుకు బెదిరింపు: అద్దెకుంటున్న వ్యక్తే కీలక సూత్రధారి!

Ram Narayana

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. ఆపై ఇంటికి ఆహ్వానించి నిలువు దోపిడీ

Ram Narayana