రౌడీయిజం ,గుండాయిజం ,రాజకీయ హత్యలు గురించి తుమ్మల మాట్లాడటం హాస్యాస్పదం ..మంత్రి పువ్వాడ కౌంటర్ ఎటాక్ ….
రౌడీ షీటర్లపై అరాచక శక్తులపై కేసులు పెట్టడం తప్పా…? చట్టం తన పని తాను చేసుకుపోవడం నేరమా …?
మంత్రిపదవులు ఇచ్చిన ఎన్టీఆర్ ను ,చంద్రబాబును ,కేసీఆర్ ను మోసం చేశావు
పాలేరు సీటు రాకపోవడంతో ప్రస్టేషన్ లో మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ధ్వజం
తుమ్మల గోబెల్స్ ప్రచారాన్ని నమ్మకండి ….
ఖమ్మానికి మంచినీళ్లు తెచ్చింది నువ్వా …ప్రజలు నవ్వుకుంటారు
ఖమ్మానికి ఏమిచేశావో చెప్పు ….అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు
ఖమ్మంలో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. మాజీమంత్రి తుమ్మల , మంత్రి పువ్వాడ అజయ్ లమధ్య జరుగుతున్న మాటల యుద్ధం కురుక్షేత్రాన్ని తలపిస్తుంది… మంత్రి పువ్వాడ అరాచనక పాలన సాగిస్తున్నారని ,ప్రజలు భయంభయంగా గజగజ వణుకుతూ బతుకుతున్నారని , పోలీస్ కేసులు, బెదిరింపులు , భూకబ్జాలు నిత్యకృత్యమయ్యాయని ఇది నాటి ఖాసీం రజ్వీ పాలనను తలపిస్తుందని పువ్వాడపై చేసిన విమర్శలకు ప్రతిగా పువ్వాడ అజయ్, తుమ్మల పై ఘాటు విమర్శలు చేశారు ..రౌడీయిజం ,గుండాయిజం ,రాజకీయ హత్యలు చేయించిన తుమ్మల వాటిగురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు ..పాలేరు సీటు కోసం వెళ్ళితే ఖమ్మం సీటు ఇచ్చే సరికి ఏమిమాట్లాడాలో అర్ధం కాక ఫ్రస్టేషన్ ఉండి మాట్లాడుతున్నారని తుమ్మలపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రి అజయ్ .. ఆదివారం ఖమ్మం నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మల విమర్శలకు పై కౌంటర్ ఎటాక్ చేశారు . ఖమ్మానికి ఏమిచేశారో చెప్పుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దీన్ని విజ్ఞులైన ప్రజలు ఖండించాలని ,తనకు అండగా నిలవాలని కోరారు..
గడచిన 9ఏళ్లలో ఖమ్మం నగర ప్రజలు చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. తుమ్మల ఖమ్మం ఎమ్మేల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేసిన రాజకీయ హత్యలు అన్ని ఇన్ని కావన్నారు.. ఆయన వల్ల కష్టం అనుభవించిన వారి ఆత్మలు ఘోషీస్తునే ఉన్నాయన్నారు. ఖమ్మం నగరం అభివృద్ది చెందినదా లేదా అని రియల్ ఎస్టేట్ వారిని, బిల్డర్స్, ఇతర ఏ వ్యాపారుల నైనా అడగండి వారు నుండి ఒక్క పైసా అన్న తీసుకున్నామో లేదో అని.. మరి ఏం అరాచకాలు చేశామని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని నిలదీశారు .కడుపు కట్టుకుని అవినీతికి దూరంగా ఉండి రూ.3500 కోట్లతో ఖమ్మం నగరాన్ని అభివృద్ది చేస్తే మీ కళ్ళకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు.
రాజకీయాలు ఉండొచ్చు గాక కానీ ఇంత హీనస్థితికి దిగజారి మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
“నందమూరి తారక రామారావు ఇచ్చిన పదవులు అనుభవించి ఆయన ను మోసం చేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళావు.. చంద్రబాబు దగ్గర మంత్రి పదవి పొంది ఆయన ను మోసం చేసి..కేసీఆర్ దగ్గరికి చేరవు.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరావు ఏది నీ నిజాయితీ.. ఏది నీ నిబద్దత.. ఏది నీ నికార్సు తనం అని ద్వజమెత్తారు”.
అసలు ఖమ్మం నగరం గతంలో ఇంత దుర్భర పరిస్థితులు తీసుకొచ్చింది తమరు కాదా ..? అని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మీ అవసరం కోసం వాడుకున్నరే తప్ప అభివృద్ది అనే పదానికి ఖమ్మంను ఆమడ దూరంలో ఉంచింది నిజంకాదా అన్నారు . ఖమ్మానికి ఎవరేం చేశారో ప్రజలుకు అన్ని ప్రజలకు తెలుసునని , ఎవరు ఖమ్మంను అభివృద్ది చేశారో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
మెదటి సారి 2014లో ఒక అండర్ డాగ్ గా రాజకీయాల్లోకి వచ్చిన నన్ను ఖమ్మం ప్రజలు తుమ్మల రాజకీయాలను భరించలేక గెలిపించినమాట వాస్తవం కాదా …? తిరిగి ఖమ్మం అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న నన్ను ఆశ్వీరదింస్తారనే విశ్వాసం ఉందని అన్నారు .
మీరు, మీ పార్టీ ద్వారా ప్రజలకు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చెప్పండి.. ఎం చేశారో చెప్పండి అంతే గాని అది వదిలేసి కేవలం నా క్యారెక్టర్ ను బద్నాం చేయాలని కంకణం కట్టుకుంటే ప్రజలు నమ్మరని హితువు పలికారు. ఎమ్మేల్యేగా పని చేసినప్పుడు ఒక్క పని చెప్పండి ఎం చేశారో.. చెప్పుకోవడానికి పెద్దగా ఒక్క పని కూడా చేయలేదు..
మంచినీరు సమస్య పరిష్కారం చేశామని చెప్తున్నారు.. ఎక్కడ చేశారు..? మీరు టీడీపీ ఎమ్మేల్యేగా ఉన్నపుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. ఎలా చేశారో గుర్తు చెప్పండి .
నగరంలో 25వేలు ఉన్న నీటి కనెక్షన్స్ ను 75వేలకు పెంచినం… ఇక్కడ మీరు చేసింది ఏముంది.. ఎక్కడుంది చెప్పాలి అన్నారు.
మీరు ఖమ్మంలో ఎమ్మేల్యేగా ఉన్నపుడు ఖమ్మం ను ఎందుకు చిన్న చూపు చూశారు.. అయమైన పార్క్ ఒక్కటి ఉండేదా.. నేడు ఖమ్మం లో ప్రతి డివిజన్ లో పార్కులు, ఓపెన్ జిమ్ లు, క్రీడా ప్రారంగణలు, రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, మంచినీరు ఇలా అనేక పనులు చేసి ప్రజలకు అందించాం కదా అన్నారు . నిజం చెప్పులేసుకుని వచ్చే సరికి అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది అన్న చందంగా ఉంది తుమ్మల మాటలు ఉన్నాయన్నారు .. గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఖమ్మం నగరంపై, ఎవరు అభివృద్ది చేశారా అన్న అంశాలపై కనీస రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.