ఖమ్మం బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ నామినేషన్ తిరస్కరించండి …తుమ్మల
ఎన్నికల కమిషన్ నియమనిబంధనలు బీఆర్ యస్ అభ్యర్థి పాటించలేని ఆరోపణ
నిబంధనల ప్రకారం 8 కాలాలు ఉండాల్సిన ఫార్మెట్ 6 కాలాలకు కుదించడం నిబంధనలను అతిక్రమించడమే ..
రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశా …జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
రిటర్నింగ్ అధికారి లిఖిత పూర్వక విసరణ కోరాను
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు సిద్ధం …న్యాయపోరాటం చేస్తా..
ఎస్ ఆర్ గార్డెన్ లో జరిగిన మీడియా సమావేశంలో తుమ్మల …
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఫార్మట్ కు అనుగుణంగా లేదని అందువల్ల దాన్ని తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు రిటర్నింగ్ అధికారిని కోరారు…. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం 8 కాలాలలో ఉండాల్సిన ఫార్మెట్ లేదని కేవలం 6 కెలలోలోనే ఉందని తుమ్మల పువ్వాడ నామినేషన్ జిరాక్స్ ప్రతులను విలేకర్లకు చూపించారు ..ఇదే విషయాన్నీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని అడిగితె నామినేషన్ అంతా సక్రమంగానే ఉందని అంటున్నారని ఇదే విషయాన్నీ నేను జిల్లా కల్లెక్టర్ ,జిల్లా ఎన్నికల పరిశీలకులు , రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ దృష్టికి తీసుకోని పోయినట్లు తుమ్మల తెలిపారు .రిటర్నింగ్ అధికారిని తమ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ అధికారికంగా ఒక వివరణ పత్రం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు . నామినేషన్ వేసిన అనంతరం తమకు ఎన్నికల కమిషన్ అందజేసిన చేతి పుస్తకంలో నిబంధలు ప్రకారం నడుచుకోవాలని తాము అధికారులను కోరుతున్నామని అన్నారు . న్యాయపోరాటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని తుమ్మల అన్నారు . ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసేందుకు తాము సిద్ధమైయ్యామని రేపు తమ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లనున్నట్లు తుమ్మల పేర్కొన్నారు …తాము కోరు కునేది ఒక్కటే ఎన్నికల నిబంధనలు అందరికి ఒకేలా ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్లు నామినేషన్ వేస్తామంటే కుదరరు ..సొంత ఫార్మెట్ అంటూ ఏమి ఉండదు …చివరకు ముఖ్యమంత్రి అయినా దాన్ని అనుసరించి నడుచుకోవాల్సిందే …మరి ఇక్కడ అభ్యర్థికి సొంత నిబంధనలు ఏమైనా ఉన్నాయా ..? అని తుమ్మల ప్రశ్నించారు …