తెలంగాణ వార్తలు

రోడ్డు పక్కన హోటల్‌లో మిర్చి బజ్జీ రుచి చూసిన కేటీఆర్…

  • కరీంనగర్‌లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి హాజరైన కేటీఆర్
  • తిరుగు ప్రయాణంలో కొత్తపల్లిలో ఓ హోటల్ వద్ద మిర్చి భజ్జీ తిని, ఛాయ్ తాగిన కేటీఆర్
  • అన్నను తీసుకువచ్చినందుకు నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఇవ్వాలన్న రసమయి
  • ఏం సెంటిమెంట్ అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

  కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్‌తో ఈ రోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో మానకొండూర్ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద ఓ హోటల్ వద్ద ఆగారు. హోటల్ వద్ద మహిళను అడిగి ఓ మిరపకాయ బజ్జీని తీసుకొని తిన్నారు. స్థానికులతో కాసేపు ముచ్చటించారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ హోటల్ యజమానురాలిని ఉద్దేశించి.. ‘అమ్మా.. తల్లీ.. నేను అన్నను తీసుకొచ్చాను… నువ్వు నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఇవ్వాలి’ అని సరదాగా అన్నారు. దానికి కేటీఆర్ నవ్వుతూ… ఏం సెంటిమెంట్? అన్నారు. 

నేను ఓ మిర్చి తీసుకుంటున్నానని హోటల్ యజమానురాలికి చెప్పి మరీ కేటీఆర్ ఓ మిర్చీని తీసుకొని రుచి చూశారు. కేటీఆర్ వెంట రసమయి బాలకిషన్, బోయినపల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు. వారంతా మిర్చీ తింటూ… ఆ తర్వాత ఛాయ్ తాగి కాసేపు కూర్చొని ముచ్చటించారు. కేటీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

Related posts

రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత హర్షం

Ram Narayana

హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం..!

Ram Narayana

కేటీఆర్‌కు ఓటమి ఖాయం, హరీశ్ రావు తప్ప ఆ పార్టీలో ఎవరూ గెలవరు : ఎంపీ అరవింద్ జోస్యం

Ram Narayana