Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి…ఎంపీ నామ

కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే లక్ష్యం గా సోషల్ మీడియా వారియర్స్ పని చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.వరంగల్ – నల్గొండ -, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో సోషల్ మీడియా వారియర్స్ గురుతరమైన బాధ్యతను నిర్వర్తిoచాలని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ లోని మూడో నెంబర్ క్రమ సంఖ్య లో రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని నామ గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఉన్నత విద్యా వంతుడు రాకేష్ రెడ్డి అన్నారు. సేవ చేయాలనే ఉన్నత ఆశయంతో రాజకీయాల్లో కి వచ్చిన రాకేష్ రెడ్డిని ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. యువతలో, విద్యావంతుల్లో మంచి పట్టు ఉండడంతో కేసీఆర్ రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. ప్రజా సేవ కోసం ఎంతో ఉన్నత లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన్ని గెలిపించి, చట్ట సభల్లో కొట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. ఎంతో కష్ట పడి చదువుకుని పైకి వచ్చిన ఆయనకి పేదింటి కష్టాలు తెలుసన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అన్ని రంగాల్లో ని పట్టభద్రుల సమస్యలు తెలుసని నామ పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి ని గెలిపిస్తే చట్ట సభల్లో పట్ట భద్రుల గౌరవాన్ని మరింతగా పెంచడానికి కృషి చేస్తారని , ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని నామ పట్టభద్రుల ను కోరారు.

Related posts

అన్యాయం జరిగింది.. కానీ పార్టీ కోసం ఉపసంహరించుకున్నా: పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి

Ram Narayana

బీఆర్ యస్ ను వీడటమా…!నాన్సెన్స్ ,బేస్ లెస్ అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్ …!

Ram Narayana

గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో కేసీఆర్‌కు దడ పుట్టింది: ధర్మపురి అర్వింద్

Ram Narayana

Leave a Comment