జాతీయ వార్తలు

హోర్డింగ్ కూలిన ఘటనలో మృతి చెందిన బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు

  • ముంబైలో ఇటీవల కూలిపోయిన భారీ హోర్డింగ్
  • ఈ ప్రమాదంలో 16 మంది మృతి
  • హీరో కార్తీక్ ఆర్యన్ బంధువుల కన్నుమూత

బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. ముంబైలో అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా ఇటీవల ఒక భారీ హోర్డింగ్ కూలిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 250 టన్నుల బరువున్న హోర్డింగ్ ఒక పెట్రోల్ బంక్ పై పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కార్తీక్ ఆర్యన్ బంధువులు కూడా ఉన్నారు. కార్తీక్ ఆంటీ అనిత (59), అంకుల్ (60) ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలకు కార్తీక్ హాజరయ్యారు. తన ఆంటీ, అంకుల్ కు నివాళి అర్పించారు. అంత్యక్రియలకు కార్తీక్ హాజరు కావడంతో ఆయన బంధువులు చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది.

Related posts

వాహ‌న‌దారుల‌కు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన!

Ram Narayana

ఒక బైక్… రెండు హెల్మెట్లు.. కేంద్రం కీలక నిర్ణయం!

Ram Narayana

మావోయిస్టు పార్టీకి నేను కార్యదర్శిని కాదు ..కార్యదర్శి ఎన్నిక జరగలేదు …దేవీజీ

Ram Narayana