ఆంధ్రప్రదేశ్

తెలంగాణ గేయం ,చిహ్నం మార్పుపై మీ బాధ ఏంటి …? మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ గేయం, చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. పదేళ్లుగా రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబసభ్యులు..ధర్నా చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే సీఎం రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. మెజార్టీ ప్రజలు కోరుకునే నిర్ణయాలనే సీఎం రేవంత్ అమలు చేస్తున్నారన్నారు మహేశ్ కుమార్ గౌడ్.

రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులపై చార్మినార్ దగ్గర కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం లోగోలో మార్పు చేస్తోందని.. లోగో మార్పుపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేసీఆర్ పెట్టిన గుర్తులను కావాలని సీఎం రేవంత్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనలేదని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్నారన్నారని ఆరోపించారు. లోగోలో చార్మినార్ ను తొలగించడమంటే హైదరాబాద్ ను అవమానించడమేనన్నారు చార్మినార్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

Related posts

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం.. ఎందుకంటే!

Drukpadam

జగన్ కు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఫోన్… నో చెప్పిన వైసీపీ అధినేత

Ram Narayana

చక్రస్నానంతో ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు… శ్రీవారి హుండీ ఆదాయం రూ.25.12 కోట్లు

Ram Narayana