Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ…

  • అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేల సాయం
  • రూ.2 వేల చొప్పున ఏడాదిలో మూడుసార్లు అందజేత
  • ఇవాళ రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేసిన మోదీ
  • మొత్తం 9.26 కోట్ల రైతులకు లబ్ధి

రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏడాదిలో మూడు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం రూ.6 వేలు అందిస్తుండగా, ఒక్కో విడతలో రూ.2 వేల చొప్పున అందిస్తున్నారు. 

తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు జమ చేశారు. 

2019లో పీఎం కిసాన్ పథకం ప్రారంభించాక ఇప్పటివరకు 16 విడతల్లో నిధులు విడుదల చేశారు. ఇవాళ 17వ విడత నిధులు విడుదల చేశారు.

Related posts

 తెలంగాణ ఎన్నికలు… 17న ఒకేరోజు మూడు సభల్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ

Ram Narayana

మూత్ర విసర్జన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి…

Drukpadam

 ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదుల మెరుపుదాడి.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికుల వీరమరణం

Ram Narayana

Leave a Comment