ఖమ్మం వార్తలు

త్రాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

త్రాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

ఖమ్మం నగరంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమీషనర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యలతో సోమవారం సమావేశమయ్యారు. నీటి ఎద్దడి సమస్య పరిష్కారం, తదితర సమస్యలపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మున్నేరు వరదల వల్ల మరమ్మత్తుకు గురైన మోటార్ల వల్ల నగరంలోని తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిలోగా సమస్యను పరిష్కరించి, నీటి సమస్య రానివ్వకుండ చూడాలని అధికారులను ఆదేశించారు.

Related posts

పేదల స్థలాల జోలికొస్తే సహించం – సీపీఐ (ఎం)

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ….

Drukpadam

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి..!

Ram Narayana