జాతీయ వార్తలు

శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైన విస్తారా విమానం!

  • 180 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విస్తారా
  • సాంకేతిక సమస్యతో 20 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికుల తరలింపు

ఢిల్లీ వెళుతున్న ఓ విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 180 మంది ప్రయాణికులతో విస్తారా విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో ఆ విమానం గాల్లోనే ఇరవై నిమిషాల ఉంది. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విస్తారా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తరలించారు.

Related posts

బీహార్ ఎన్నికలు: రూ. 37 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్ పట్టివేత..

Ram Narayana

ఆ ఊళ్లో ‘మందు’ లేకుండా పెళ్లి చేస్తే నజరానా ఇస్తారు!

Ram Narayana

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్ కు ఇచ్చిన విందుకు హాజరు కావడంపై శశి థరూర్ ఏమన్నారంటే..!

Ram Narayana