ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ…

  • కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్
  • ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్
  • ప్రకటన విడుదల చేసిన ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులు 2025 మార్చితో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో, ఆ రెండు స్థానాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 

కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్… తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ లను టీడీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 

కాగా, వైసీపీ కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కృష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది.

Related posts

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు… డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్

Ram Narayana

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామంలో సీఎం రమేశ్ పై దాడి!

Ram Narayana

18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇక మిగిలింది మూడే!

Ram Narayana