క్రైమ్ వార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం!

  • బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరి వద్ద హైడ్రోపోలిక్ వీడ్‌ను గుర్తించిన అధికారులు
  • 7.096 కిలోల డ్రగ్స్ స్వాధీనం
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను హైడ్రోపోలిక్ వీడ్‌గా గుర్తించారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వీరిద్దరి లగేజీని తనిఖీ చేసిన సమయంలో అనుమానం వచ్చిన అధికారులు… క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 13 కెల్లాగ్స్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్‌ను గుర్తించారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Related posts

సైబర్ క్రైమ్ 3 నిమిషాల వ్యవధిలో కోటి 10 లక్షలు డ్రా …అప్రమత్తమైన కస్టమర్

Ram Narayana

రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసుపై వీడిన మిస్ట‌రీ!

Ram Narayana

ఇండిగో విమానం ఎయిర్‌హోస్టస్‌తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన!

Drukpadam