ఖమ్మం వార్తలు

ఎర్రజెండాల ఐక్యతేదేశానికి ప్రత్యామ్నాయం…శతజయంతిసభలో కూనంనేని

కమ్యూనిస్టుల పురోగమనమే దేశానికి రక్షఅని యావద్దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతుందని పురోగమనం తప్పదని భారత కమ్యూనిస్టుపార్టీ సి.పి.. ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 99 ఏళ్ళ కమ్యూనిస్టుపార్టీ సుదీర్ఘచరిత్రలో అనేక పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగలున్నాయని కార్మిక, కర్షక హక్కుల కోసం పోరాడిన ఏకైక పార్టీ సి.పి.ఐ మాత్రమేనన్నారు. భారత కమ్యూనిస్టుపార్టీ శతవంత సంవత్సరలోకి అడుగిడుతున్న సందర్భంగా గురువారం సి.పి.ఐ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పాత ధర్నా చౌక్ నుండి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు సాగిన ప్రదర్శన అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో సి.పి.ఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేస్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ పార్టీ పుట్టుక నుంచి అనేక నిర్భందాలను ఎదుర్కొన్నదని దాదాపు ఒకే సమయంలో సమయంలో ఆవిర్భవించిన ఆర్.ఎస్.ఎస్. దేశ విచ్చిన్నాన్ని కోరుకుంటే భారత కమ్యూనిస్టుపార్టీ కార్మికులు, కర్షకులు,బడుగు, బలహీన వర్గాల అభ్యన్నతి కోసం పనిచేసిందన్నారు. అదే సమయంలో కాంగ్రెసపార్టీ సంపన్నవర్గాల కోసం పనిచేసిందని టాట, బిర్లా, గోయంకా, మఫత్లాల్ లాంటి పారిశ్రామిక వేత్తల కోసం కాంగ్రెస్ పనిచేసిందన్నారు. సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం కూడా కమ్యూనిస్టులదేనని కూనంనేని తెలిపారు.

కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా అనేక చట్టాలొచ్చాయని అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని సాంబశివరావు తెలిపారు. ప్రపంచ చరిత్రలో వినుతికెక్కిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం తెలంగాణ ప్రజల జీవన గతిని మార్చిందని ఈ పోరాటంలో అనేక వేలమంది అమరులయ్యారని ఆయన తెలిపారు. నాటి నుండి నేటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు కమ్యూనిస్టుల తాగ్యాగలతో తెలంగాణ పుణీతమైందన్నారు.

రావి నారాయణరెడ్డి, మఖ్తూ మెహినుద్దీన్ బద్దం ఎల్లారెడ్డి పిలుపుతో మొదలైన సాయుధ తెలంగాణ సంగ్రామం తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగును నింపిందని భూస్వామ్య వ్యవస్థపోయి కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా భూమి పేదల పరమైందన్నారు. తెలంగాణ సాధనోద్యమంలో కమ్యూనిస్టులు అత్యంత కీలకభూమిక పోషించారన్నారు. భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని నల్లమల గిరిప్రసాద్, మహ్మద్ రజబ్ అలీ, దేవూరిశేషగిరిరావు, సర్వదేవభట్ల రామానథం, మనబోతుల కుమరయ్యతో సహా వందలాది మంది ప్రజల అభ్యున్నతి కోసం త్యాగాలు చేశారని వారి త్యాగలకు వారసులుగా కమ్యూనిస్టులుగా ఉన్నందులకు మేము గర్వపడుతున్నామని సాంబశివరావు తెలిపారు. పూటకోపార్టీ మారేవారు.కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారని నీతి, రీతీ లేని వారు ఇటు వంటి కువిమర్శలు చేస్తుంటారని ఆయన అన్నారు. కమ్యూనిస్టుల అవసరం పెరుగుతుందని మతోన్మాద శక్తులు బరి తెగించిన వేళ దేశంలో లౌకిక వాదం ప్రమదంలో పడిందని ఆర్.ఎస్.ఎస్., బీజీపీలతో దేశంలో ప్రజాస్వామానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. వామపక్ష శక్తుల ఐక్యత ఈ దేశంలో మతోన్మాధ బూర్జువా రాజకీయపార్టీలకు ప్రత్యామ్నాయంగా మారుతుందని కూనంనేని తెలిపారు. భవిష్యత్లో కమ్యూనిస్టుల ఐక్యత విలీనానికి సి.పి.ఐ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

కమ్యూనిస్టుపార్టీ చరిత్రలో పోరాటాల పురిటి గడ్డగా ఖమ్మం ఖ్యాతి గడించిందని, అమరులత్యాగాలు అనన్య పోరాటాలు ఖమ్మం జిల్లాలో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించాయని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఓ ఉద్యమ చరిత్ర ఉందన్నారు. సి.పి.ఐ శత సంవత్సర ఆవిర్భాభ సభలో హేమంతరావు మాట్లాడుతూ గణేశ్వరం, వినోభానగర్, తోటపల్లి లాంటి చారిత్రిక భూపోరాటాలకు కమ్యూనిస్టుపార్టీ నేతృత్వం వహించిందన్నారు.

కోట్ల రూపాయల బయ్యారం ఖనిజ సంపద వ్యక్తుల పరంకాకుండా కాపాడి ఘన చరిత్ర కమ్యూనిస్టుపార్టీకి ఉందన్నారు. రైతాంగ కార్మిక, పేద ప్రజల కోసం చారిత్రక పోరాటాలను కమ్యూనిస్టుపార్టీ నిర్వహించిందన్నారు.

కమ్యూనిస్టుపార్టీ వందో సంవత్సరంలోకి పెరిగుడుతున్న సందర్భంగా ప్రజా పోరాటాలకు పునరంకితమవుతుందన్నారు. ఈ సభలో సి.పి.ఐ సీనియర్నాయకులు పువ్వాడనాగేశ్వరరావు, సి.పి.ఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ ఛైర్మెన్ మహ్మద్ మౌలానా ప్రసంగించగా రాష్ట్ర సమితిసభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, ఎన్.కె. జానిమియా, ఏపూరిలతాదేవి, కొండపర్తిగోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్, జిల్లాకార్యవర్గసభ్యులు, ప్రజాసంఘాల బాధ్యులు వేదికపై ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టుపార్టీలో పనిచేసిన పువ్వాడనాగేశ్వరరావు, మహ్మద్ మౌలానా, డాక్టర్ పి.గోర్కీ సహా 39 మంది సీనియర్ కమ్యూనిస్టులను సన్మానించారు.

భారత కమ్యూనిస్టుపార్టీ శతవసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా సుదీర్ఘకాలం కమ్యూనిస్టుపార్టీ నాయకులుగా, ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారిని ఆవిర్భావ సందర్భంగా స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో సన్మానించారు. శాసనసభ్యునిగా, శాసనమండలి సభ్యునిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి నుంచి సి.పి.ఐ జాతీయ కార్యవర్గసభ్యుని వరకు పనిచేసిన పువ్వాడ నాగేశ్వరరావును సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బాగం హేమంతరావు, దండి సురేష్ తదితరులు సన్మానించారు. అనేక దశాబ్దాలపాటు ఖమ్మం ప్రాంతంలో దండుగా నిలిచి అనేక నిర్భందాలను ఎదుర్కొని ప్రజా ఉద్యమంలో కొనసాగుతున్న మహ్మద్ మౌలానాను, కమ్యూనిస్టుకుటుంబంలో పుట్టి తండ్రి పారుపల్లి రామయ్య వారసత్వానిపునికిపుచ్చుకొని కమ్యూనిస్టుగా కొనసాగుతూ ప్రజా వైద్యునిగా పేరొందిన డాక్టర్ పారుపల్లి గోర్కీని కూనంనేని తదితరులు సన్మానించారు. అలాగే బోజెడ్ల సూర్యారావు, వేమిరెడ్డి రామిరెడ్డి, చింతకాయల వెంకటేశ్వర్లు, గడల సరస్వతి, బోడపోతుల లక్ష్మయ్య, తూము సుశీల, పుచ్చకాయల నీలమ్మ, పారుపల్లి రాఘవులు, పయ్యావుల లింగయ్యలను సి.పి.ఐ రాష్ట్ర, జిల్లా నాయకులు సన్మానించారు.

Related posts

సాగర్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

Ram Narayana

ఖమ్మం ఫలితంపై నామ విశ్వాసం …ఫలితం అనూహ్యంగా ఉంటుందని ధీమా..!

Ram Narayana

న్యూస్ ఇన్ బ్రీఫ్ …….ఖమ్మం

Drukpadam