జాతీయ రాజకీయ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీకి ఐదు రోజుల్లో ఎన్నికలు …కేజ్రీవాల్ కు 7 గురు ఎమ్మెల్యేల షాక్ …

ఈనెల 5 న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ అధికార ఆప్ పార్టీకి 7 గురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు …ఈసారి అసెంబ్లీ టిక్కెట్లు రాని 7 తాజా ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించిన సంచలనం సృష్టించారు …వీరి రాజినామా వెనక బీజేపీ ఉండవచ్చునని అభిప్రాయాలు ఉన్నాయి…కేవలం ఐదు రోజులు ఎన్నికలు ఉండగా ఇది బీజేపీకి అనుకూలిస్తుందా లేదా అనేది చూడాలి ..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. పోలింగ్‌కు మరో నాలుగైదు రోజులు మాత్రమే గడువు ఉండగా, ఇలాంటి కీలక సమయంలో ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆందోళన కలిగిస్తోంది.

కేజ్రీవాల్ నాయకత్వంపై, పార్టీపై విశ్వాసం కోల్పోయిన కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్ లాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు వారు తమ రాజీనామా లేఖలను కేజ్రీవాల్‌కు పంపించారు.

‘పార్టీ పట్ల, మీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి’ అని భావనా గౌర్ తన లేఖలో పేర్కొన్నారు.

ఇదే బాటలో మెహ్రాలియా, రాజేశ్ రిషి, మదన్ లాల్, నరేశ్ యాదవ్, పవన్ శర్మ, భూపిందర్ సింగ్ జూన్ రాజీనామా చేశారు. అయితే, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి పార్టీ అవకాశం కల్పించలేదు.

Related posts

దేశం కోసం రాహుల్ ప్రాణాలర్పించారంటూ మల్లికార్జునఖర్గే పొరపాటు.. అలా ఎప్పుడు జరిగిందన్న బీజేపీ

Ram Narayana

 ‘బీజేపీతో నితీశ్ కుమార్ జత’ అంటూ కథనాలు… అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై చర్చ!

Ram Narayana