ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లాలో దార్ గ్యాంగ్ కలకలం… ముగ్గురిని అరెస్ట్ చేశామన్న జిల్లా ఎస్పీ!

  • కొన్నిరోజులుగా అనంతపురం జిల్లాలో దార్ గ్యాంగ్ కదలికలు
  • అప్రమత్తమైన పోలీసులు
  • అనంతపురంలో గత నెలలో మూడు ఇళ్లలో చోరీ
  • నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ జగదీశ్

అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా దార్ గ్యాంగ్ కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ దార్ గ్యాంగ్ చోరీలు చేయడంలో ఆరితేరింది. అనంతపురం జిల్లాలో ఈ ముఠా సభ్యుల కదలికలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు దార్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ పి.జగదీశ్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. 

దార్ గ్యాంగులోని ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని వెల్లడించారు. నిందితుల నుంచి రూ.90 లక్షల విలువైన ఆభరణాలు, రూ.19.35 లక్షల నగదు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

ఈ దార్ ముఠా సభ్యులు గత నెలలో అనంతపురంలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు. ఈ ముఠాలోని ఒక సభ్యుడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకంగా 32 కేసులు ఉన్నాయని వెల్లడించారు.

Related posts

జీరో టికెట్ వివాదం.. ఉద్యోగం నుంచి తొలగింపు.. మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Ram Narayana

తిరుపతి సంస్కృత వర్సిటీలో కీచక పర్వం.. విద్యార్థినిపై ఇద్దరు ప్రొఫెసర్ల అఘాయిత్యం…

Ram Narayana

పెరు బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి!

Drukpadam