tamilisai father
జనరల్ వార్తలు ...

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృ వియోగం

తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమళిసై సౌందర రాజన్ తండ్రి కుమారి అనంతన్ (93) కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఆయన బుధవారం తెల్లవారు జామున చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 1933లో కన్యా కుమారి జిల్లాలోని కుమారి మంగళంలో జన్మించిన అనంతన్ కాంగ్రెస్ పార్టీలో క్రియా శీలకంగా పని చేశారు. తన తండ్రి ప్రభావంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. 1977లో నాగర్ కోయిల్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అంతే కాకుండా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తమిళ రచయితగా, వక్తగా ఆయనకు మంచి పేరుంది. రాష్ట్రానికి అనంతన్ చేసిన సేవలకు గాను 2024లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత ‘తగైసల్ తమిజార్’ పురస్కారంతో సత్కరించింది. 2021లో ‘కామరాజర్’ అవార్డును ప్రధానం చేసింది.

Related posts

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో హీరో నాగార్జున భేటీ

Ram Narayana

Smart speaker sales will eventually hit a wall – report

Ram Narayana

అవమానాలు ఇక చాలు… రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి

Ram Narayana