Delhi Airport
అంతర్జాతీయం

425 మంది ప్రయాణిస్తున్న విమానంలో మంటలు .. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసర పరిస్థితి..!

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి రష్యా రాజధాని మాస్కో కు 425 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏరో ఫ్లోట్‌ విమానం.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ఆగి వున్న సమయంలో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో అధికారులు పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. ప్రయాణికులను విమానం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఏరో ఫ్లోట్‌కు చెందిన SU 273 విమానం క్యాబిన్‌లో మంటలు చెలరేగాయని, దాంతో ఎయిర్‌ పోర్టులో పూర్తి స్థాయి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రయాణికులను రెస్క్యూ చేశామని ఎయిర్‌ పోర్టు అధికారులు తెలిపారు. విమానంలోని మొత్తం 425 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే విమానంలో మంటలు చెలరేగడానికి కారణం ఏమిటి..? ప్రస్తుతం విమానం ఢిల్లీ ఎయిర్‌ పోర్టులోనే ఉందా లేదంటే మాస్కోకు బయలు దేరిందా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

రెప్పతో పాటు కంటిని సమూలంగా మార్చిన వైద్యులు

Ram Narayana

వాషింగ్టన్‌లో ‘పేరుమోసిన నేరస్థుడు’ ట్రంపేనట..మస్క్ ఏఐ ‘గ్రోక్’ వివాదాస్పద వ్యాఖ్య..

Ram Narayana

ప్రపంచం అల్లాడిపోతున్నా చైనాకు మాత్రం బేఫికర్..

Ram Narayana