దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం పరీక్షకు నమోదుచేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్ icai.org. చూడవచ్చని తెలిపింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: