జాతీయ వార్తలు

ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు 41 ఏళ్లు.. స్వర్ణ దేవాలయంలో ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు

సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన పంజాబ్‌ అమృత్‌సర్‌ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple)పై ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ (Operation Blue Star) పేరుతో జరిపిన సైనిక చర్యకు నేటికి 41 ఏళ్లు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇదే రోజున జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌ వాలే చనిపోయాడు. ఈ సందర్భంగా స్వర్ణదేవాలయం (Amritsar Godlen Temple)లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు వినిపించాయి. కార్యక్రమంలో కొందరు ఖలిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వర్ణ దేవాలయంలో SAD (మన్ వర్గం) నాయకుడు సిమ్రంజిత్ సింగ్ మాన్ సిక్కుల పవిత్ర స్థలానికి చేరుకోగానే.. ఆయన అనుచరులు ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Related posts

ఒడిశా గుహల్లో ఆదిమానవుల ఆనవాళ్లు… ఫొటోలు ఇవిగో!

Ram Narayana

ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల హతం

Ram Narayana

శబరి గిరుల్లో చారిత్రక ఘట్టం..ఇరుముడితో పడిమెట్లెక్కిన రాష్ట్రపతి..

Ram Narayana