Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది .. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను: నారా లోకేశ్

  • ‘తల్లికి వందనం’ సూపర్ సక్సెస్ అయిందని మంత్రి లోకేశ్ వ్యాఖ్య
  • తల్లుల ఆనందం చూసి జగన్‌కు కడుపుమంట పెరిగిందంటూ ఎద్దేవా
  • జగన్ తన పత్రికలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • కొందరు లబ్ధిదారులకు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే నిధుల విడుదలని స్పష్టం
  • దొంగ లెక్కలు, అవినీతి జగన్ బ్రాండ్ అని, తమది కాదని విమర్శ
  • జగన్‌కు రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తానంటూ లోకేశ్ వ్యంగ్యం

‘తల్లికి వందనం’ పథకం అద్భుత విజయం సాధించిందని, ఇది చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి కడుపుమంట మూడు రెట్లు పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అందుకే, ఈ పథకం అమలు తీరుపై జగన్ రెడ్డి తన పత్రిక ద్వారా మరోసారి అసత్య ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. “తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం… చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది… రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి… కాస్త తగ్గుద్ది” అంటూ ఎద్దేవా చేశారు.

Related posts

న‌ల్ల‌గొండలో కుప్ప‌కూలిన ఆర్మీ శిక్ష‌ణ హెలికాప్ట‌ర్.. ఇద్ద‌రి మృతి!

Drukpadam

జైపూర్ కు మకాం మార్చిన సోనియా గాంధీ.. కారణం ఇదే!

Ram Narayana

మున్నేరు వరద భాదితులను పరామర్శించిన అంతరం మీడియాతో భట్టి

Ram Narayana

Leave a Comment